భజన్ లాల్ శర్మ | |||
భజన్ లాల్ శర్మ అధికారిక చిత్రం, 2023 | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 15 డిసెంబరు 2023 | |||
గవర్నరు | |||
---|---|---|---|
డిప్యూటీ | |||
ముందు | అశోక్ గెహ్లోట్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 డిసెంబరు 3 | |||
ముందు | అశోక్ లాహోటీ | ||
నియోజకవర్గం | సంగనేర్ | ||
రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి
| |||
పదవీ కాలం 2016 – 2023 | |||
రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ కమిటీ ఉపాధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2014 – 2016 | |||
పదవీ కాలం 2000 – 2005 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] నాద్‌బాయి, రాజస్థాన్, భారతదేశం | 1966 డిసెంబరు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | గీతా శర్మ | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | రాజస్థాన్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి |
|
భజన్ లాల్ శర్మ (జననం: 1966 డిసెంబరు 15) అతను ఒక భారతీయ రాజకీయ నాయకుడు. భజన్ లాల్ శర్మ 2023 డిసెంబరు 15 నుండి రాజస్థాన్ 14వ ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగుచున్నారు.[2] భజన్ లాల్ శర్మ సంగనేర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16వ రాజస్థాన్ శాసనసభ సభ్యుడు.[3][4]
భజన్ లాల్ శర్మ భరత్‌పూర్ జిల్లా భరత్‌పూర్‌లోని నాద్‌బాయిలోని అటారీ గ్రామంలో జన్మించారు.[5] భజన్ లాల్ శర్మ కిషన్ స్వరూప్ శర్మ గోమతీ దేవి దంపతులకు జన్మించాడు.[6] భజన్ లాల్ శర్మ, రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నాడు.[7]
భజన్ లాల్ శర్మ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. భజన్ లాల్ శర్మ తరువాతభారతీయ జనతా యువ మోర్చాలో చేరాడు 27 సంవత్సరాల వయస్సులో తన స్వగ్రామానికి సర్పంచ్ అయ్యాడు [7] భారతీయ జనతా పార్టీ, కార్యదర్శిగా భజన్ లాల్ శర్మ నాలుగు సార్లు ఎన్నికయ్యారు.[8] భజన్ లాల్ శర్మ 2003 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.[9]
2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో, భజన్ లాల్ శర్మ సంగనేర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[10]
2023 డిసెంబరు 12న, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మను భారతీయ జనతా పార్టీ తరుపున రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమించింది. దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలను [11] ఉప ముఖ్యమంత్రులుగా నియమించింది.
2023 డిసెంబరు 12న, ఇద్దరు డిప్యూటీ సీఎంలు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాతో పాటు భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ 14వ ముఖ్యమంత్రిగా నియమించింది.[12][13]అతను తన ఇద్దరు ఉప ముఖ్య మంత్రులతో పాటు 2023 డిసెంబరు 15న రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[14]