భర్తృహరి మహతాబ్ | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1998 | |||
ముందు | అనాది సాహు | ||
---|---|---|---|
నియోజకవర్గం | కటక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అగర్పడ , ఒడిషా, భారతదేశం | 1957 సెప్టెంబరు 8||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బీజేపీ (2024 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీజేడీ (1999 - 2024) | ||
తల్లిదండ్రులు | హరేకృష్ణ మహతాబ్ , సుభద్ర మహతాబ్ | ||
జీవిత భాగస్వామి | మహాశ్వేతా మహతాబ్ | ||
సంతానం | 1 కుమారుడు, 1 కుమార్తె | ||
నివాసం | కటక్ | ||
పూర్వ విద్యార్థి | ఉత్కల్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | జర్నలిస్ట్ , రాజకీయ నాయకుడు | ||
మూలం | [1][2] |
భర్తృహరి మహతాబ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998 నుండి 2019 వరకు కటక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] భర్తృహరి మహతాబ్ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి దివంగత హరే కృష్ణ మహతాబ్ కుమారుడు.[4]
భర్తృహరి మహతాబ్ 1997లో బిజూ జనతా దళ్ స్థాపించిన నటి నుండి పార్టీలో ఉంటూ 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కటక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999, 2004, 2009, 2014, 2019లో వరుసగా ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
అతను 2014 నుండి 2019 వరకు లోక్‌సభలో బీజేడీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసి పార్లమెంటు చర్చలలో అతని అత్యుత్తమ పనితీరుకుగాను 2017 నుండి 2020 వరకు వరుసగా 'సంసద్ రత్న' అవార్డును అందుకున్నాడు.[5]
భర్తృహరి మహతాబ్ 2024 మార్చి 22న బీజేడీ పార్టీకి రాజీనామా చేసి[6], మార్చి 28న ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ఒడిశా బీజేపీ కో-ఇన్‌చార్జ్ విజయ్‌పాల్ సింగ్ తోమర్ సమక్షంలో బీజేపీలో చేరాడు.[7][8]
భర్తృహరి మహతాబ్ 2024లో ఎన్నికలలో ఎంపీగా గెలిచి,[9] లోక్‌సభ స్పీకర్ ఎన్నికయ్యే వరకు స్పీకర్ విధులను నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం 2024 జూన్ 20న లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించాడు.[10][11]
Fifteenth Lok Sabha Members Bioprofile