భలే కృష్ణుడు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | కె. కృష్ణమోహనరావు |
తారాగణం | కృష్ణ, జయప్రద , మోహన్ బాబు |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | జంధ్యాల |
ఛాయాగ్రహణం | కె.ఎస్. ప్రకాష్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | విజయ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
భలే కృష్ణుడు, కృష్ణ నటించిన ఒక హాస్య చిత్రం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, జయప్రద, మోహన్ బాబు ముఖ్య పాత్రలు ధరించారు. చక్రవర్తి సంగీతం కూర్చాడు.[1]
కృష్ణ లక్షాధికారి మాధవ్ రావు కుమారుడు. మాధవ రావు భాగస్వాములు అతన్ని మోసం చేస్తారు. అది అతని మరణానికి దారితీస్తుంది. కృష్ణ తన కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇదీ కథ లోని ఇతివృత్తం.
కృష్ణ తన స్నేహితుల అవసరాలకు డబ్బు ఇచ్చి ఆనందిస్తూంటాడు. సంగీతను ప్రేమిస్తాడు. అతను అనుకోకుండా గ్రామీణ యువతి జయప్రదను కలుసుకుని ఆమెను ఆటపట్టిస్తాడు. ఒక రోజు అతడి తండ్రి జగ్గయ్యను కార్యదర్శి నాగభూషణం మోసగించి ఆస్తి రాయించుకుంటాడు. అది జగ్గయ్య మరణానికి దారితీస్తుంది. కృష్ణ కుటుంబాన్ని నాగభూషణం, అతని మిత్రులు మోహన్ బాబు, అల్లు రామలింగయ్యలు రోడ్డుపైకి లాగుతారు. కృష్ణ స్నేహితులను సహాయం అడిగినప్పుడు వారు అతనికి ఖాళీ చేతులు చూపిస్తారు. అతను తన ఆస్తిని కోల్పోయినప్పుడు సంగీత అతన్ని విడిచిపెడుతుంది. కృష్ణ జయ ప్రద సహాయంతో ఉద్యోగం సంపాదించి, తన కుటుంబాన్ని నడపడానికి శ్రమ చేయడం మొదలుపెడతాడు. అక్కడ అతను సత్యనారాయణను కలుస్తాడు. అతను తన కుటుంబ ప్రస్తుత పరిస్థితుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కృష్ణకు నిజం చెప్పి, నాగభూషణాన్ని శిక్షించమని కోరతాడు. అతడు ఈ పని సాధించడమే మిగతా కథ
దర్శకుడు: కోవెలమూడి రాఘవేంద్రరావు
సంగీతం.కొమ్మినేని చక్రవర్తి
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
నిర్మాణ సంస్థ: విజయ క్రియేషన్స్
ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రకాష్
మాటలు: జంధ్యాల
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
విడుదల:14:01:1980.
అత్రేయ, వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడారు
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog .