భలే దొంగలు (2008 {{{language}}} సినిమా) | |
దర్శకత్వం | విజయ భాస్కర్ |
---|---|
నిర్మాణం | శాఖమూరి పాండురంగ రావు, బెల్లంకొండ సురేష్ |
తారాగణం | తరుణ్ కుమార్, ఇలియానా, జగపతి బాబు |
సంగీతం | కె.ఎమ్.రాధాకృష్ణన్ |
సంభాషణలు | అబ్బూరి రవి l |
నిడివి | l |
[[వర్గం:2008_{{{language}}}_సినిమాలు]]
భలే దొంగలు 2008 లో వచ్చిన తెలుగు చిత్రం. దీనిని శ్రీ లక్ష్మీ దేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శాఖమూరి పాండురంగారావు, బెల్లంకొండ సురేష్ నిర్మించారు. కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు. తరుణ్, ఇలియానా ప్రధాన పాత్రల్లో, జగపతి బాబు ప్రముఖ పాత్రలో నటించారు. కెఎమ్ రాధా కృష్ణన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సగటుగా నడిచింది. ఈ సినిమాను హాలీవుడ్ లో క్లాసిక్ సినిమా బానీ అండ్ క్లైడ్(1969) స్పూర్తితో తీశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
రాము, మరో ఉద్యోగ ఇంటర్వ్యూలో ఛీ కొట్టించుకుని ఇంటికి వస్తాడు. కోపించిన తండ్రి అతణ్ణి చిన్నబుచ్చుతాడు. ఈ ప్రక్రియలో, రాము తాను ఉద్యోగం చెయ్యనని, వ్యాపారం చేయాలనుకుంటున్నాననీ చెబుతాడు. ఈ ఆలోచనను తండ్రి ఛీకొడతాడు. ఆ రాత్రి అతను ఇంటి నుండి వెళ్ళిపోతాడు.
జ్యోతి మోడల్‌గా పనిచెయ్యాలని, నగరంలో అందాల పోటీలో పాల్గొనాలనీ కోరుకుంటుంది. ఆమె తన తల్లి తండ్రులకు ఈ విషయం చెబుతుంది. కాని ఆమె నాయనమ్మ మాత్రం దీనికి ఒప్పుకోదు. మరుసటి రోజు జ్యోతికి పెళ్ళిచూపులు కూడా ఏర్పాటు చేస్తుంది. జ్యోతి ఒప్పుకోదు. కానీ ఆమె నాయనమ్మ ఆమెను పట్టించుకోదు. ఆమె తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉండిపోతారు. ఆమె కల నెరవేర్చుకోడానికి, ఆ రాత్రి ఇంటి నుండి పారిపోయి, రాము ఎక్కిన రైలే ఎక్కుతుంది.
రైలులో, ఒక అపరిచితుడు వారికి బిస్కెట్లు ఇస్తాడు,రాము వాటిని తింటాడు. మెలకువ వచ్చి చూసుకునే సరికి అతని సామాను పోతుంది. ఒక అధికారికి ఫిర్యాదు చేస్తూండగా జ్యోతి కూడా అక్కడికి వస్తుంది.ఆమె సామాను కూడా పోయింది. ఆ అధికారి వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు. వారి వద్ద ఉన్న డబ్బును సేవా రుసుముగా తీసుకుంటాడు. ఆ వ్యక్తి మోసగాడని అనీ, వాళ్ళ దగ్గర ఉన్న కాస్త డబ్బునూ అతడు కొట్టేసాడనీ వాళ్ళు తరువాత తెలుసుకుంటారు.
రాము తన ఉంగరాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. కాని బాగా తక్కువ వస్తుంది. జ్యోతి అందాల పోటీకి వెళుతుంది కాని ఆమెకు ప్రవేశ టికెట్ లేనందున లోనికి రానివ్వరు. ఒక అధికారి ఆమెను చూసి తనతో ఒకరాత్రి గడిపితే పోటీలో ఉండనిస్తానని ఆమెకు ఆఫర్ ఇస్తాడు. పరిశ్రమ చవకబారు తనం చూసి ఆశ్చర్యపోయిన ఆమె ఆ అధికారిని అవమానించి వెళ్లిపోతుంది. రాత్రి అవుతూండగా ఆమె తిరిగి రైలు స్టేషన్ వద్దకు వస్తుంది. అక్కడ ఆమె మళ్ళీ రామును కలుస్తుంది. ఇద్దరూ కలిసి తమ నేర జీవితాలను ప్రారంభిస్తారు.
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రోమియో జూలియట్" | సాహితి | టిప్పు | 3:51 |
2. | "నీతోనే" | వనమాలి | షాన్, గీతామాధురి | 4:20 |
3. | "పంచదార ఎడారిలో" | వేటూరి సుందరరామమూర్తి | టిప్పు, గాయత్రి | 4:14 |
4. | "మనసులో నువ్వేనా" | రామజోగయ్య శాస్త్రి | ఉదిత్ నారాయణ్, చిత్ర | 4:31 |
5. | "పసందైన వేళ" | కె.ఎం. రాధాకృష్ణన్ | చిత్ర | 4:37 |
6. | "చోటా చోటా" | చంద్రబోస్ | టిప్పు | 4:10 |
మొత్తం నిడివి: | 25:50 |