భాగ్యశ్రీ థిప్సే | |
---|---|
పూర్తి పేరు | భాగ్యశ్రీ సాఠే థిప్సే |
దేశం | భారతదేశం |
పుట్టిన తేది | 1961 ఆగస్టు 4 |
టైటిల్ | ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ |
ర్యాంకింగ్ | 15981 యాక్టీవ్ (1961) |
భాగ్యశ్రీ థిప్సే (జననం 1961 ఆగస్టు 4) ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదును కలిగిన భారతీయ చెస్ క్రీడాకారిణి.[1]
ఆమె 1985 (నాగ్‌పూర్), 1986 (జలంధర్), 1988 (కురుక్షేత్ర), 1991 (కోజికోడ్), 1994(బెంగళూరు)లలో ఐదుసార్లు భారతీయ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించింది. 1991లో భోపాల్ లో ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[2] 1984లో ఆమె బ్రిటిష్ లేడీస్ ఛాంపియన్‌షిప్‌లో వాసంతి ఉన్నితో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది.[3][4] ఆమె మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2000లో పోటీ పడింది. అయితే మొదటి రౌండ్‌లో పెంగ్ జావోకిన్(Peng Zhaoqin) చేతిలో ఓడిపోయింది.
ఆమె ప్రస్తుతం ముంబైలోని ఐడీబీఐ(IDBI Bank)లో ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది.
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రవీణ్ థిప్సేతో వివాహమైన తర్వాత ఆమె తన పేరును భాగ్యశ్రీ సాఠే థిప్సేగా మార్చుకుంది.[5]
ఆమెను భారతప్రభుత్వం 1987లో పద్మశ్రీ పురస్కారం, అర్జున అవార్డులతో సత్కరించింది.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)