భారతదేశం ఎన్నికల కమిషనరు, | |
---|---|
![]() | |
![]() | |
ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి సుఖ్‌బీర్ సింగ్ సంధు వివేక్ జోషి[1] పదవీకాలం ప్రారంభం 2024 మార్చి 14 & 2025 మార్చి 1 | |
ఎవరికి రిపోర్టు చేస్తారు | భారత పార్లమెంట్ |
స్థానం | నిర్వచన్ సదన్, న్యూ ఢిల్లీ, భారతదేశం |
నియమించేవారు | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సులో (ఏది ముందు అయితే అది) |
ప్రారంభ హోల్డర్ | సుకుమార్ సేన్ |
జీతం | ₹2,25,000 (US$2,800) |
వెబ్‌సైటు | Election Commission of India |
భారత ఎన్నికల కమీషనర్లు, భారత ఎన్నికల కమిషన్‌లో సభ్యులు, భారతదేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు రాజ్యాంగబద్ధంగా అధికారం కలిగిన సంస్థ. భారత ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫార్సుపై భారత రాష్ట్రపతి ఎన్నికల కమీషనరును నియమిస్తారు. ఎన్నికల కమీషనరు పదవీకాలం గరిష్ఠంగా ఆరు సంవత్సరాలు లేదా అతను/ఆమె అరవై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉంటుంది. ఎన్నికల కమిషనర్లు సాధారణంగా ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులై ఉంటారు.
1950 నుండి, భారత ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమీషనరు ఒక్కరే ఉండే ఏకసభ్య సంస్థగా ఉంటూ వచ్చింది. ఎన్నికల కమీషనర్ సవరణ చట్టం, 1989 ప్రకారం, 1989 అక్టోబరు 16న మొదటిసారిగా కమిషన్‌లో ఇద్దరు అదనపు ఎన్నికల కమీషనర్‌ల నియామకంతో కమిషను, బహుళ-సభ్య సంస్థగా మారింది. 1990 జనవరి 1 న ఎన్నికల కమీషనర్ల పదవిని రద్దు చేశారు.[2] 1993 అక్టోబరు 1 న ఎన్నికల సంఘాన్ని మరోసారి ముగ్గురు సభ్యుల సంఘంగా మార్చారు.[3]
ఎన్నికల కమీషనర్లు భారత ఎన్నికల కమిషన్‌లో భాగంగా ఉన్నారు, జాతీయ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా అధికారం కలిగిన సంస్థ. భారత ఎన్నికల సంఘపు ఈ అధికారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుండి తీసుకోబడింది.[2] ఎన్నికల కమిషనర్లు సాధారణంగా ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులై ఉంటారు. భారత ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు ఓవర్‌రూలింగ్ అధికారాలు లేవు. ముగ్గురిలో మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకుంటారు.[2]
ఎన్నికల కమిషనర్ నియామకం, పదవీకాలం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమీషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023లో నిర్దేశించబడింది. చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం, భారత ప్రధాని నేతృత్వంలోని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రివర్గం లోని ఒక సభ్యునితో కూడిన ఎంపిక కమిటీ సిఫార్సుపై ఆధారపడి భారత రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్‌ని నియమిస్తారు.[4] సిఇసి పదవీకాలం అతను/ఆమె తన పదవిని స్వీకరించిన తేదీ నుండి గరిష్ఠంగా ఆరు సంవత్సరాలు ఉండవచ్చు. అయితే, సిఇసి పదవీకాలం ముగియడానికి ముందు అతను/ఆమె అరవై-ఐదు సంవత్సరాల వయస్సును చేరుకున్నట్లయితే పదవి నుండి పదవీ విరమణ చేస్తారు.[2]
లోక్‌సభ, రాజ్యసభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండి దానికి ఓటు వేయడానికి అవసరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనరును తొలగించవచ్చు. సిఇసి సిఫార్సుపై రాష్ట్రపతి, ఎన్నికల కమీషనర్లను తొలగించవచ్చు.[2] 2009 లో, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారంటూ ఎన్నికల కమిషనరు నవీన్ చావ్లాను తొలగించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు సిఫార్సు పంపాడు.[5] అటువంటి సిఫార్సుకు రాష్ట్రపతి కట్టుబడి ఉండవలసిన అసవరం లేదని అభిప్రాయపడుతూ, రాష్ట్రపతి దానిని తిరస్కరించారు.[6]
ఎన్నికల సంఘం (ఎన్నికల కమిషన్ల సేవా నిబంధనలు, వ్యాపార లావాదేవీల) చట్టం, 1991 ప్రకారం, ఎన్నికల కమీషనర్ జీతం, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతంతో సమానం.[7] సిఇసి నెలవారీ జీతం రూ 3,50,000 కాగా వీటికి తోడు భత్యాలు ఉంటాయి[7][8]
హోదా | పేరు | పదవి స్వీకరించిన తేదీ | పదవీకాలం ముగిసే తేదీ |
---|---|---|---|
ప్రధాన ఎన్నికల కమిషనర్ [9] | జ్ఞానేష్ కుమార్ | 2025 ఫిబ్రవరి 19 | ప్రస్తుతం అధికారంలో ఉన్నారు |
ఎన్నికల కమిషనర్లు | సుఖ్‌బీర్ సింగ్ సంధు[10] | 2024 మార్చి 14 | ప్రస్తుతం అధికారంలో ఉన్నారు |
వివేక్ జోషి[11] | 2025 మార్చి 1 | ప్రస్తుతం అధికారంలో ఉన్నారు |
పేరు | పదవీ బాధ్యతలు స్వీకరించారు | కార్యాలయం నుండి నిష్క్రమించారు | వ్యవధి |
---|---|---|---|
వి.ఎస్. సీగెల్ | 1989 అక్టోబరు 16 | 1990 జనవరి 2 | 78 రోజులు |
ఎస్.ఎస్. ధనోవా | 1989 అక్టోబరు 16 | 1990 జనవరి 2 | 78 రోజులు |
జివిజి కృష్ణమూర్తి | 1993 అక్టోబరు 1 | 1999 సెప్టెంబరు 30 | 5 సంవత్సరాలు, 364 రోజులు |
అశోక్ లావాసా | 2018 అక్టోబరు 23 | 2020 అక్టోబరు 31 | 1 సంవత్సరం, 313 రోజులు |
అనూప్ చంద్ర పాండే | 2021 జూన్ 9 | 2024 ఫిబ్రవరి 14 | 2 సంవత్సరాలు, 250 రోజులు |
అరుణ్ గోయల్ | 2022 నవంబరు 19 | 2024 మార్చి 9 | 1 సంవత్సరం, 111 రోజులు |
సుఖ్‌బీర్ సింగ్ సంధు[10] | 2024 మార్చి 14 | ప్రస్తుతం అధికారంలో ఉన్నారు | |
వివేక్ జోషి[11] | 2025 మార్చి 1 | ప్రస్తుతం అధికారంలో ఉన్నారు |