![]() Indian Astronaut Logo | |
దేశం | India |
---|---|
సంస్థ | Human Space Flight Centre (ISRO) |
స్థితి | Active |
ప్రోగ్రాము చరిత్ర | |
ప్రోగ్రాము వ్యవధి | 2006–present[1]
|
తొలి ఫ్లైటు | Gaganyaan-1 (2024)[2] |
తొలి మానవ సహిత ఫ్లైటు | Gaganyaan-4 (NET 2025)[3] |
ప్రయోగ స్థలాలు | Satish Dhawan Space Centre |
వాహన సమాచారం | |
ప్రయోగ వాహనాలు |
|
భారత మానవ అంతరిక్షయాత్ర కార్యక్రమాన్ని[4] భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2007 లో రూపొందించింది.[5] భూ నిమ్న కక్ష్య లోకి మానవులతో కూడిన కక్ష్యా వాహనాన్ని పంపించే సాంకేతికను అభివృద్ధి చెయ్యడం ఈ కార్యక్రమ ఉద్దేశం.[6] గగన్‌యాన్ అనే అంతరిక్ష నౌకను జిఎస్‌ఎల్‌వి మార్క్ -3 రాకెట్టు ద్వారా ప్రయోగించే [7][8][9] తొట్టతొలి యాత్రను 2021 డిసెంబరులో[10] చెయ్యాలని ఇస్రో తలపెట్టింది.
2018 ఆగస్టులో గగన్‌యాన్ను ప్రకటించే ముందు, మానవ అంతరిక్ష యాత్ర ఇస్రో ప్రాధాన్యాల్లో లేదు. అయితే దీనికి అవసరమైన శక్తి సామర్ధ్యాలు చాలావరకు ఇస్రో సాధించింది.[11] ఈ యాత్రకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలావరకు ఇస్రో అప్పటికే అభివృద్ధి చేసింది. క్రూ మాడ్యూల్ వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం జరిపింది. అత్యవసర పరిస్థితుల్లో యాత్రను నిలిపేసే ప్యాడ్ అబార్ట్ టెస్ట్ చేసింది.[12] ఈ ప్రాజెక్టుకు రూ. 10,000 కోట్ల లోపు ఖర్చౌతుంది.[13][14] 2021 డిసెంబరులో జరప తలపెట్టిన ముగ్గురు వ్యోమగాముల, 7 రోజుల తొట్టతొలి యాత్రకు భారత ప్రభుత్వం మరో 10,000 కోట్లను 2018 డిసెంబరులో మంజూరు చేసింది.[7][10][15]
షెడ్యూల్ ప్రకారం పూర్తయితే, సోవియట్ యూనియన్ / రష్యా, అమెరికా, చైనాల తరువాత స్వతంత్రంగా మానవ అంతరిక్ష యాత్రను నిర్వహించిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. మానవ అంతరిక్ష యాత్రలను నిర్వహించిన తరువాత, వాటికి కొనసాగింపుగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. చంద్రుడిపైకి మానవ యాత్రను కూడా చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు.[16][17]
2007 ఆగస్టు 9 న అప్పటి ఇస్రో ఛైర్మన్ జి. మాధవన్ నాయర్, మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమ రూపకల్పనను ఏజెన్సీ "తీవ్రంగా పరిశీలిస్తోందని" సూచించాడు. కొత్త అంతరిక్ష నౌక టెక్నాలజీల అభివృద్ధిపై ఇస్రో ఒక సంవత్సరంలోనే నివేదిస్తుందని కూడా ఆయన సూచించాడు.[18] ఇద్దరు వ్యోమగాములను భూ నిమ్న కక్ష్యలోకి తీసుకువెళ్ళడానికి పూర్తి స్వయంప్రతిపత్తి గల కక్ష్యా వాహన అభివృద్ధి కొన్ని నెలల తరువాత ప్రభుత్వం ₹ 95 కోట్లు కేటాయించినప్పుడు ప్రారంభమైంది 2007 - 2008 లలో ప్రాజెక్టు సన్నాహకాల కోసం ఈ నిధులను కేటాయించింది. మానవ అంతరిక్ష యాత్రకు ₹ 12,400 కోట్లు, ఏడు సంవత్సరాలూ కావాలి. 2007–2012 కాలానికి ఈ కార్యక్రమం కోసం ₹ 5,000 కోట్లు అవసరమౌతాయని ప్రణాళికా సంఘం అంచనా వేసింది [19][20] 2009 ఫిబ్రవరిలో, భారత ప్రభుత్వం మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది, [21] కానీ దీనికి పూర్తిగా నిధులు సమకూర్చడంలో గాని, సమకూర్చే షెడ్యూలును సృష్టించడంలో గానీ అది విఫలమైంది.
2007 లో పిఎస్‌ఎల్‌వి ద్వారా 600 కిలోల స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ను ప్రయోగించి, 12 రోజుల తరువాత తిరిగి భూమికి తెప్పించడం ద్వారా కార్యక్రమ పరీక్షలు మొదలయ్యాయి. దీని తరువాత 2014 లో క్రూ మాడ్యూల్ వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం, 2018 లో ప్యాడ్ అబార్ట్ పరీక్ష విజయవంతంగా జరిగాయి.
వ్యోమగాములకు అంతరిక్ష ఆహారం తయారీలో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ పనిచేసింది. వ్యోమగాములు ధరించే జి-సూట్ మీద పరీక్షలు నిర్వహిస్తోంది.[22][23] కేజీ, ష్యూర్ సేఫ్టీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన 13 కిలోల 'అడ్వాన్స్‌డ్ క్రూ ఎస్కేప్ సూట్' అనే నమూనాను పరీక్షించి, దాని పనితీరును ధ్రువీకరించుకున్నారు.[24][25][26][27]
అన్ని ప్రాథమిక పరీక్షలలో విజయం సాధించిన తరువాత, [28] మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి నిర్ణయాత్మకమైన ఊపు 2017 లో వచ్చింది.[4] 2018 ఆగస్టు 15 న ప్రధానమంత్రి అధికారికంగా ప్రకటించారు.[29] 2020 డిసెంబరులో పరీక్షల దశ ప్రారంభమవుతుందని, మొదటి మానవ సహిత యాత్ర 2021 డిసెంబరులో జరుగుతుంది.[30]
యాత్ర రకం | ప్రతిపాదిత సమయం | సిబ్బంది |
---|---|---|
పరీక్షా యాత్ర 1 | 2020 - డిసెంబరు | ఎవరూ ఉండరు |
పరీక్షా యాత్ర 2 | 2021 - జూలై | ఎవరూ ఉండరు |
మానవ సహిత యాత్ర | 2021 - డిసెంబరు | ముగ్గురు |
ముగ్గురు వ్యోమగాములతో కూడిన సిబ్బందిని భూ నిమ్న కక్ష్యలోకి తీసుకువెళ్ళి, కొన్ని కక్ష్యల పాటు పరిభ్రమించడం నుండి రెండు రోజుల వరకు అంతరిక్షంలో ఉంచి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకు వచ్చేలా గగన్‌యాన్ అనే 3.7-టన్నుల బరువు గల నౌకను తయారుచేయడం ఈ కార్యక్రమపు మొదటి దశ. మొట్టమొదటి యాత్ర 2021 డిసెంబరులో జరపాలని తలపెట్టారు.[31][34] ఈ నౌక, తన విస్తరిత రూపంలో ఏడు రోజుల పాటు యాత్ర చెయ్యడంతో పాటు, అంతరిక్ష కేంద్రంతో రెందెవూ (కలవడం) చెయ్యడం, డాకింగు చెయ్యడం వంటివి చెయ్యగలదు.
తరువాతి దశలో, చిన్న ఆవాసాన్ని అభివృద్ధి చేసి, మానవులు ఏకబిగిన 30-40 రోజుల పాటు అంతరిక్షంలో ఉండేలా అభివృద్ధి చేస్తారు. ఈ అనుభవాల సాయంతో కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసి, అంతరిక్ష కేంద్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు.[35]
2016 అక్టోబరు 7 న, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టరైన కె. శివన్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అని పిలిచే క్లిష్టమైన పరీక్ష నిర్వహించడానికి ఇస్రో సన్నద్ధమవుతోందని, ఈ పరీక్షలో అత్యవసర పరిస్థితిలో సిబ్బంది మాడ్యూల్ ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా నౌక నుండి విడి పోతుందో పరీక్షిస్తామనీ తెలిపాడు. ఈ పరీక్ష 2018 జూలై 5 న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో విజయవంతంగా జరిగింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెక్నాలజీకి అర్హత సాధించిన పరీక్షల శ్రేణిలో ఇది మొదటిది.[36][37]
జీవనాధార వ్యవస్థల పరీక్షల కోసం భారతదేశం జంతువులను ఉపయోగించదు; మానవులను పోలి ఉండే రోబోట్లను ఉపయోగిస్తుంది.[38][39] ఆపత్కాల సమయంలో సిబ్బంది తప్పించుకునే వ్యవస్థకు 99.8%కి మించిన విశ్వసనీయత ఉండాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.[40]
2018 ఆగస్టు నాటికి ఉన్న సమాచారం ప్రకారం, ఇస్రో తన గగన్‌యాన్‌ను జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎమ్‌కె III పైన ప్రయోగించాలని యోచిస్తోంది.[7][8][41][42] పైకి లేచిన 16 నిమిషాల తరువాత, రాకెట్ కక్ష్యా వాహనాన్ని 300 - 400 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. గుజరాత్ తీరానికి దగ్గరలో అరేబియా సముద్రంలో ఈ వాహనం నీటిపై దిగుతుంది.[43] 2019 మే నాటికి సిబ్బంది మాడ్యూల్ రూపకల్పన పూర్తయింది.[44] మానవ సహిత అంతరిక్ష ప్రయాణాన్ని నిర్వహించడానికి ముందు రెండుసార్లు మానవులు లేకుండా యాత్రలు జరిపి వ్యోమనౌక పనితీరును ధ్రువీకరించుకుంటారు.[31][32][33]
ఏదైనా రవాణా వ్యవస్థ మానవులను సురక్షితంగా రవాణా చేయగలదో లేదో మానవ-రేటింగ్ అంచనా వేస్తుంది. GSLV-MK III యొక్క మానవ రేటింగ్‌ను ధ్రువీకరించడానికి ఇస్రో 2 యాత్రలను చేస్తుంది.[45] ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతమున్న ప్రయోగ సౌకర్యాలను మానవ ప్రయోగాలను నిర్వహించడానికి తగినట్లుగా మెరుగు పరుస్తారు.[46][47]
తప్పించుకునే వ్యవస్థలో భాగంగా కొత్త జామెట్రీ ఉంటుంది. పారాచూట్ విస్తరణ పైన, కొత్త ఆర్కిటెక్చరు పైనా కూడా పనులు జరుగుతున్నాయి.[48][49]
వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి బెంగుళూరులో మానవ అంతరిక్ష యాత్ర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ కె. శివన్ 2019 జనవరిలో ప్రకటించాడు. వ్యోమగాములను వ్యోమనాట్స్ అని పిలుస్తామని కూడా అతను ప్రకటించాడు. (వ్యోమా అంటే సంస్కృతంలో అంతరిక్షం, ఖగోళం అని అర్థం).[50] ₹ 1,000 కోట్ల ఈ కేంద్రం, ఆత్మ రక్షణ, రికవరీల్లోను, శూన్య గురుత్వంలో పనిచెయ్యడంలోను, రేడియేషన్ వాతావరణాన్ని పర్యవేక్షించడంలోనూ వ్యోమగాములకు శిక్షణ ఇస్తుంది.
బెంగళూరు, దేవలహళ్ళి వద్ద గల కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపం లోని 140 ఎకరాల స్థలంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.[51]
2009 వసంతకాలంలో వ్యోమగాముల శిక్షణ కోసం సిబ్బంది క్యాప్సూల్ యొక్క పూర్తి స్థాయి నమూనను తయారు చేసి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి, వ్యోమగాముల శిక్షణ కోసం అప్పగించారు. ఇందుకోసం 200 మంది భారతీయ వైమానిక దళ పైలట్లను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఇస్రో ప్రశ్నపత్రాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తరువాత వారు శారీరక, మానసిక విశ్లేషణలకు లోనవుతారు. 200 మంది దరఖాస్తుదారులలో 4 గురుమాత్రమే మొదటి యాత్రకు ఎంపికౌతారు. ఇద్దరు యాత్ర చెయ్యగా, మిగతా ఇద్దరు రిజర్వుగా ఉంటారు.[52][53]
వ్యోమగాముల మానసిక, శారీరక అవసరాలపై పరిశోధన కోసం, శిక్షణా సౌకర్యాల అభివృద్ధిపై ప్రాథమిక పరిశోధన చేయడం కోసం 2009 లో ఇస్రో భారత వైమానిక దళానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.[54][55] వ్యోమగామి శిక్షణ యొక్క కొన్ని అంశాలకు సంబంధించి రష్యాతో ఒప్పందం చేసుకోవడం గురించి కూడా ఇస్రో చర్చిస్తోంది.[56][57]
భారత వ్యోమగాముల ఎంపిక, మద్దతు, వైద్య పరీక్ష, అంతరిక్ష శిక్షణలో సహకారం కోసం ఇస్రో యొక్క మాన అంతరిక్ష యాత్రా కేంద్రం రష్యా ప్రభుత్వ రోర్‌కాస్మోస్ కార్పొరేషను అనుబంధ సంస్థ అయిన గ్లావ్‌కాస్మోస్‌తో 2019 జూలై 1 న ఒక ఒప్పందం కుదుర్చుకుంది.[58] కొన్ని కీలక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి, అంతరిక్షంలో జీవితానికి తోడ్పడటానికి అవసరమైన ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటుకు మాస్కోలో ఇస్రో సాంకేతిక సంప్రదింపుల కేంద్రాన్ని (ఐటిఎల్‌యు) నెలకొల్పుతుంది.[59]
2024 ఫిబ్రవరి 27 న, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో, గగన్‌యాన్ ప్రోగ్రామ్‌లో భాగంగా, భవిష్యత్తు అంతరిక్ష యాత్రకు అర్హత పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాడు. ఇండో-అమెరికా సంయుక్త మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే యాత్రకు కూడా వీళ్ళు అర్హులే.[60][61][62][63]
ఎంపికైన వ్యోమగాములు:
ఈ కార్యక్రమంలో వారికి భారతీయ వ్యోమగామి రెక్కలు, గగన్‌యాన్ మిషన్ లోగో, మోటో లను అందించారు.[64][65]
2018 నవంబరు 7 న, గగన్‌యాన్ యొక్క మొదటి రెండు రోబోటిక్ పారీక్షా యాత్రల సమయంలో మైక్రోగ్రావిటీ ప్రయోగాలను చేసేందుకు భారతీయ వైజ్ఞానిక సమాజం నుండి ప్రతిపాదనలు కోరుతూ ఇస్రో ఒక ప్రకటనను విడుదల చేసింది.[66][67] ప్రయోగాల పరిధిని ఇస్రో పరిమితం చేయలేదు. సంబంధిత కొత్త ఆలోచనలను కూడా స్వాగతించారు. మైక్రోగ్రావిటీ ప్లాట్‌ఫాం కోసం ప్రతిపాదిత కక్ష్య సుమారు 400 కి.మీ. ఎత్తులో ఉంటుందని భావిస్తున్నారు. యాత్రల్లో ఉపయోగించేందుకు ప్రతిపాదించిన అంతర్గత, బాహ్య ప్రయోగాత్మక పేలోడ్‌లన్నిటినీ అవసరమైన ఉష్ణ, పీడన, శూన్య, ఉద్గార పరిస్థితులలో పరీక్షిస్తారు. దీర్ఘ కాలం పాటు మైక్రోగ్రావిటీ ప్రయోగాలు చేసేందుకు ఒక చిన్న ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచవచ్చు కూడా.
గగన్‌యాన్ మిషన్ యొక్క తదుపరి కార్యక్రమంగా 20 టన్నుల అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని భారత్ యోచిస్తోంది. 2019 జూన్ 13 న, ఇస్రో చీఫ్ కె. శివన్ ఈ ప్రణాళికను ప్రకటించాడు. 5-7 సంవత్సరాల కాలంలో భారత అంతరిక్ష కేంద్రం తయారౌతుందని అతను చెప్పాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కార్యక్రమంలో భారత్ చేరదని కూడా అతను చెప్పాడు. భారత అంతరిక్ష కేంద్రం ఏకబిగిన 15-20 రోజుల పాటు సిబ్బందికి ఆశ్రయమివ్వగలదు. గగన్‌యాన్ మిషన్ పూర్తయిన తర్వాతే ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం తుది అనుమతి ఇస్తుందని భావిస్తున్నారు.[68]
2017 లో ₹ 10 కోట్ల ప్రారంభ నిధులతో, అంతరిక్ష నౌక డాకింగ్, బెర్తింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఇస్రో కృషి చేస్తోంది.[69] SPADEX (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) లో భాగమైన సిగ్నల్ ఎనాలిసిస్ పరికరాలు, అధిక-కచ్చితత్వం నావిగేషన్ కోసం వీడియోమీటర్, డాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్స్, ల్యాండింగ్ వ్యవస్థల కోసం నిజ-సమయ నిర్ణయం తీసుకోవడం వంటి సాంకేతికతలు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. SPADEX లో భాగంగా, పరీక్షల కోసం ఇస్రో 2 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్ష కేంద్రానికి కీలకమైనది; ఎందుకంటే ఇది మానవులను ఒక అంతరిక్ష నౌక నుండి మరొక నౌకకు బదిలీ చేయాలంటే ఈ సాంకేతికత ఆవశ్యకం.[70]
Initially, the plan was the construct a new launch pad for the human space flight, but Sivan told the Express that due to paucity of time one of the two existing launch pads is being modified to meet the requirement.
{{cite web}}
: External link in |website=
(help)