సైనిక దినోత్సవం | |
---|---|
![]() | |
స్థితి | క్రియాశీలం |
ప్రక్రియ | సైనిక |
తేదీ(లు) | జనవరి 15 |
ఫ్రీక్వెన్సీ | సంవత్సరానికి ఒకసారి |
స్థలం | ఇండియా_గేట్ |
దేశం | ![]() |
జాతీయ సైనిక దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.[1]
ఫెరల్ మార్షల్ కోడన్దేరా ఏం. కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ తరువాత భారత సైన్యం మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా జనవరి 15, 1949న ఎన్నికైయ్యారు.[2] [3]జాతీయ రాజధాని న్యూఢిల్లీలో, అలాగే అన్ని ప్రధాన కార్యాలయాలలోనూ జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటారు. 2017వ సంవత్సరం జనవరి 15న న్యూఢిల్లీలో 69వ భారత సైనిక దినోత్సవం భారతదేశం జరుపుకుంది. సైనిక దినోత్సవం దేశమును, దాని పౌరులను కాపాడటానికి వారి జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను అభినందించటానికి ఒక రోజును సూచిస్తుంది.[4]