భారతదేశంలో ఔషధ రంగం అభివృద్ధిపై మరింత దృష్టి సారించడం, అందుబాటు ధరల్లో ఔషధాల లభ్యత, పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన వివిధ సంక్లిష్ట సమస్యలను నియంత్రించడం, పరిశోధన, అభివృద్ధి లక్ష్యంగా 2008 జూలై 1న రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్స్ (ఔషధముల ) విభాగాన్ని ఏర్పాటు చేశారు.సరసమైన ధరలకు నాణ్యమైన ఔషధాలను ప్రపంచానికి అందించే దిగ్గజంగా( గ్లోబల్ ప్రొవైడర్) గా భారతదేశాన్ని మార్చడం,ఫార్మా పాలసీ ప్రకారం సరసమైన ధరలకు నాణ్యమైన ఔషధాల లభ్యతను ధృవీకరించడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.[1]
ప్రపంచవ్యాప్తంగా జనరిక్ ఔషధాలను అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశంగా, అందుబాటు ధరల్లో వ్యాక్సిన్లు, జనరిక్ ఔషధాలకు భారత్ ప్రసిద్ధి చెందింది. గత తొమ్మిదేళ్లుగా 9.43% సిఎజిఆర్ తో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా పరిణామం చెందిన తరువాత, భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రస్తుతం పరిమాణం ప్రకారం ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. జనరిక్ ఔషధాలు, ఓవర్ ది కౌంటర్ మందులు, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్ భారత ఫార్మా పరిశ్రమలోని కొన్ని ప్రధాన విభాగాలు. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) కు అనుగుణంగా ఉన్న అత్యధిక సంఖ్యలో ఫార్మాస్యూటికల్ తయారీ సౌకర్యాలు భారతదేశంలో ఉన్నాయి, 500 యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడెంట్(ఎపిఐ)[2] ( క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్ధం) ఉత్పత్తిదారులను కలిగి ఉంది, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎపిఐ మార్కెట్లో 8% వాటాను కలిగి ఉన్నాయి.
వివిధ వ్యాక్సిన్లకు ప్రపంచ డిమాండ్లో 50 శాతం, అమెరికాలో జనరిక్ డిమాండ్లో 40 శాతం, యునైటెడ్ కింగ్ డమ్ 25 శాతం ఔషధాలను భారత ఫార్మా రంగం సరఫరా చేస్తోంది. దేశీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో 3,000 ఔషధ కంపెనీల అనుసంధానం (నెట్వర్క్) దాదాపు10,500 తయారీ యూనిట్లు ఉన్నాయి. ప్రపంచ ఫార్మాస్యూటికల్స్ రంగంలో భారత్ కు కీలక స్థానం ఉంది. మందుల పరిశ్రమను మరింతఅభివృద్ధిలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు భారత దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం, ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్) ను ఎదుర్కోవటానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే యాంటీరెట్రోవైరల్ మందులలో 80% పైగా భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. తక్కువ ధర, అధిక నాణ్యతతో కూడిన ఔషధాల కారణంగా భారతదేశం "ప్రపంచ ఫార్మసీ" గా ప్రసిద్ధి చెందింది.
ప్రపంచ ఫార్మాస్యూటికల్స్ రంగంలో, భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. జనరిక్ మందుల సరఫరాలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద సరఫరాదారు, ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో 20% , ప్రపంచ వ్యాక్సినేషన్ డిమాండ్లో 60% సరఫరా చేస్తుంది. భారత ఫార్మాస్యూటికల్ రంగం విలువ ప్రపంచవ్యాప్తంగా 42 బిలియన్ డాలర్లు. 2020 జూలైలో 13.7 శాతంగా ఉన్న భారత ఫార్మాస్యూటికల్ మార్కెట్ 2021 ఆగస్టులో 17.7 శాతానికి పెరిగింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మాస్యూటికల్ మార్కెట్ ఆదాయం 12% వై-ఓ-వై కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు[3].
భారతదేశం ఔషధ రంగ అభివృద్ధి లో సాధించిన గణనీయమైన ప్రగతిని ప్రపంచ వ్యాప్తంగా పొందింది[4].
భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ సవాలుగా తీసుకుని లక్షలాది మంది ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రధానంగా 2020 లో కోవిడ్-19 మందులపై దృష్టి సారించింది, కానీ 2022 నాటికి రక్తహీనత, క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులపై దృష్టి సారించింది.
భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ పరిశోధన, అభివృద్ధికి అధిక విలువను ఇవ్వడం, పరిశోధన, అభివృద్ధి చేయడం( ఆర్ అండ్ డీ), పర్యావణ సంరక్షణ ( ఎకోసిస్టమ్) విస్తరించడం, ఫార్మాస్యూటికల్ ఎగుమతులను పెంచడం ద్వారా 2022 నాటికి భారత్ గ్లోబల్ మెడికల్ దిగ్గజంగా అవతరించింది. కోవిడ్-19 మహమ్మారి ఔషధ పరిశోధనపై ప్రజల దృక్పథాన్ని మార్చివేసింది, తద్వారా కొత్త చికిత్సా పద్ధతులను పరిశోధించడం, సంక్లిష్టమైన క్లినికల్ అధ్యయనాలను నిర్వహించడం, ఔషధ పరిశోధన, అభివృద్ధి ప్రక్రియను, జ్ఞానం,సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచములో రోగులకు కొత్త వినూత్న చికిత్సలను అందించడంలో ఏకాభిప్రాయం పెరుగుతున్నందున, 2030 చివరి నాటికి భారత ఫార్మాస్యూటికల్ మార్కెట్ విలువ 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తాజా ఈవై ఫిక్కీ నివేదిక తెలిపింది[5]. 2023 నాటికి ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ప్రపంచ మార్కెట్ 1 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా[6].
{{cite web}}
: |archive-date=
requires |archive-url=
(help)