భారతదేశంలో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరల్లో అత్యంత చివరన ఉండే బిందువులు, అలాగే దేశంలో సముద్రమట్టం నుండి అత్యంత ఎత్తైన, అత్యంత లోతైన బిందువులే భారతదేశపు కొనలు. దేశానికి ఉత్తరాన ఉన్న కొన, భారత, పాకిస్తాన్ల మధ్య నున్న వివాదాస్పదమైన భూభాగంలో, పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. భారతదేశ ప్రధాన భూభాగంలో అత్యంత దక్షిణాన ఉన్న కన్యాకుమారి (కేప్ కొమోరిన్) మినహా, ఇతర దిశల్లో ఉన్న కొనల్లో ఎక్కడా జనావాసాలు లేవు.
ఈ బిందువుల అక్షాంశ, రేఖాంశాలను దశాంశ డిగ్రీ సంజ్ఞామానంలో చూపించాం. పాజిటివు అక్షాంశ విలువ ఉత్తరార్ధగోళాన్ని సూచిస్తుంది, నెగటివు విలువ దక్షిణార్ధగోళాన్ని సూచిస్తుంది. అదేవిధంగా, పాజిటివు రేఖాంశ విలువ తూర్పు అర్ధగోళాన్ని సూచించగా, నెగటివు విలువ పశ్చిమార్ధగోళాన్ని సూచిస్తుంది. ఈ వ్యాసంలో ఉపయోగించిన నిర్దేశాంకాలు WGS84 జియోడెటిక్ రిఫరెన్స్ వ్యవస్థను ఉపయోగించుకునే Google Earth నుండి తీసుకున్నాం. సముద్రమట్టం నుండి ఎత్తు విలువ నెగటివుగా ఉంటే, అది సముద్ర మట్టం కంటే దిగువన ఉన్న బిందువు (ఆ బిందువు లోతును సూచిస్తుందన్నమాట) అని అర్థం.
భారతదేశానికి ఉత్తర కొసన ఉన్న బిందువు, పాకిస్తాన్-ఆక్రమణలో ఉన్న గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగంలో ఉంది. ఇది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. ఈ జాబితాలో పాక్ ఆక్రమణలో ఉన్న భారత భూభాగపు ఉత్తర కొనను, పాకిస్తాన్ వివాదాస్పదం చేసిన భారత పాలనలో ఉన్న ఉత్తర కొసను, భారతదేశంలో వివాదరహిత ఉత్తర కొసను - ఈ మూడింటినీ - చూడవచ్చు. అత్యంత ఎత్తైన బిందువులకు కూడా ఇలాగే చూపిస్తుంది.
భారతదేశానికి అత్యంత తూర్పున ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలోని కొంత భాగాన్ని టిబెట్ అటానమస్ రీజియన్‌లో భాగమంటూ చైనా క్లెయిమ్ చేస్తోంది. భారత-పాలనలో ఉన్న భూభాగానికి అత్యంత తూర్పు బిందువు ఈ వివాదాస్పద ప్రాంతంలో ఉంది. [1] పర్యవసానంగా, ఈ జాబితా భారతదేశంలోని వివాదాస్పదమైన, వివాదరహితమైన తూర్పు బిందువులు రెంటినీ ఈ జాబితాలో చూపించాం.
విపరీతము | పేరు | ఎత్తు | స్థానం | రాష్ట్రం | కోఆర్డినేట్లు | రెఫ్(లు) |
---|---|---|---|---|---|---|
అత్యంత ఎత్తైన బిందువు
(వివాదరహిత) |
కాంచన్‌జంగా | 8,586 మీ. (28,169 అ.) | భారతదేశం-నేపాల్ సరిహద్దులో తూర్పు హిమాలయాలు | సిక్కిం | ||
అత్యంత ఎత్తైన బిందువు (వివాదాస్పదమైనది) | K2 | 8,611 మీ. (28,251 అ.) | గిల్గిట్-బాల్టిస్తాన్ (పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది), జిన్జియాంగ్ (చైనా) మధ్య సరిహద్దులో ఉన్న కారకోరం | గిల్గిత్-బాల్టిస్తాన్, పాకిస్తాన్ | [6] | |
అత్యంత ఎత్తైన బిందువు (వివాదరహితమైనది, పూర్తిగా భారతదేశంలో ఉన్నది) |
నందా దేవి | 7,816 మీ. (25,643 అ.) | గఢ్వాల్ హిమాలయాలు | ఉత్తరాఖండ్ | [6] | |
అత్యంత లోతైన బిందువు | కుట్టనాడ్ | −2.2 మీ. (−7.2 అ.) | అలప్పుళ జిల్లా | కేరళ | [11] |
<ref>
ట్యాగు; manorama
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు