దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలను సంస్కరించుటకు తగిన సూచనలు ఇచ్చేందుకు 1902నాటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్, థామస్ రాలీ అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ నియమించాడు.[1]
1902 లో విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది. దీనినే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904 అంటారు.[2]
విశ్వవిద్యాలయాలు, విధులు విస్తృతపరచబడ్డాయి. ఇవి తమంతకు తామే ప్రొఫెసర్లను లెక్చరర్లను నియమించుకోవచ్చు. పరిశోధనకు కావలసిన అవకాశాలు కల్పించారు.
సిండికేట్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది వాటి విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులకు తగిన ప్రాతినిథ్యం కల్పించబడింది.
కళాశాలలకు విశ్వవిద్యాలయం అనుబంధ ప్రతిపత్తి కల్పించేటప్పుడు కఠిన నియమాలు విధించబడ్డాయి.
కళాశాలలో విద్యా ప్రమాణాలను కాపాడేందుకు వాటిని అప్పుడప్పుడు తనిఖీ చేసేందుకు సిండికేట్కు అధికారం ఇవ్వబడింది.
ఈ చట్టం విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వం పట్టును మరింత పెంచింది. లిజిస్ట్రేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న గోపాలకృష్ణ గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
1904లో లార్డ్ కర్జన్ ఎలిమెంటరీ పాఠశాల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రత్యేక నిధులు విధులు విడుదల చేశాడు.[3]