భార్గవి నారాయణ్ (1938 ఫిబ్రవరి 4 - 2022 ఫిబ్రవరి 14) కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి, నాటక కళాకారిణి.[3][4] ఆమె నటించిన చిత్రాలలో ఎరడు కనసు, హంటకన సంచు, పల్లవి అనుపల్లవి, బా నల్లె మధుచంద్రకే వంటి విజయవంతమైనవి ఎన్నో ఉన్నాయి.[5][6][7]
భార్గవి నారాయణ్ 22కి పైగా చిత్రాలలో, అనేక నాటకాలు (కన్నడ థియేటర్), టెలివిజన్ ధారావాహికలలో నటించింది. వాటిలో మంథన, ముక్త వంటివి చెప్పుకోవచ్చు. ఆమె ఆకాశవాణి, మహిళా కార్యక్రమాలు, కర్ణాటకలోని ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ చిల్డ్రన్ కోసం నాటకాలు రాసి దర్శకత్వం వహించింది. ఆమె కన్నడ నాటక అకాడమీలో సభ్యురాలిగా పనిచేసింది.[8]
కళలలో తన వృత్తిని ప్రారంభించడానికి ముందు, ఆమె బెంగళూరులోని ఈఎస్ఐ కార్పొరేషన్ మేనేజర్ గా పనిచేసింది.
ఆమె బెంగళూరులోని అంకిత పుస్తక ప్రచురించిన నా కంద నమ్మవరు అనే పుస్తకాన్ని కన్నడలో రాసింది.
బెంగళూరులో జరిగిన 2018 బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్లో ఆమె వక్తగా వ్యవహరించింది.[9]
భార్గవి 1938 ఫిబ్రవరి 4న నామగిరియమ్మ, ఎం. రామస్వామి దంపతులకు జన్మించింది.
ఆమె వివాహం బెలవాడి నంజుండయ్య నారాయణ (మేకప్ నాని)తో జరిగింది. ఆయన కన్నడ చలనచిత్ర నటుడు, మేకప్ ఆర్టిస్ట్ కూడా.[10][11][12][13] వారికి సుజాత, ప్రకాష్, ప్రదీప్, సుధా అనే నలుగురు పిల్లలు ఉన్నారు.[14]
ఆమె ఆత్మకథ, నాను, భార్గవి ని 2012లో ప్రచురణకర్త అంకిత పుస్తక విడుదల చేసింది.[15] ఈ పుస్తకం కర్ణాటక రాష్ట్ర సాహిత్య అకాడమీ, కర్ణాటక సంఘం, షిమోగా, శ్రీమతి గంగమ్మ సోమప్ప బొమ్మై ప్రతిష్ఠాన, ధార్వాడ్, కర్ణాటక నుండి అవార్డులను గెలుచుకుంది.[16][17]
ఆమె 2022 ఫిబ్రవరి 14న బెంగళూరులోని జయనగర్ లో 84 సంవత్సరాల వయసులో మరణించింది.[18]