భువనేశ్వరి కుమారి భారతదేశానికి చెందిన మాజీ మహిళా స్క్వాష్ ఛాంపియన్. పద్మశ్రీ, అర్జున అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. వరుసగా 16 సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఆమె అల్వార్ మాజీ రాజకుటుంబానికి చెందినవారు.[1]
ప్రిన్సెస్ కాండీగా పిలువబడే కుమారి 1960 సెప్టెంబర్ 1 న న్యూఢిల్లీలో యశ్వంత్ సింగ్, బృందా కుమారి దంపతులకు జన్మించింది. ఆమె అల్వార్ మహారాజా తేజ్ సింగ్ ప్రభాకర్ బహదూర్ మనుమరాలు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు.[2]
ఆమె 1977 నుండి 1992 వరకు వరుసగా 16 సంవత్సరాలు మహిళల జాతీయ స్క్వాష్ ఛాంపియన్. [3]
ఆమె 41 స్టేట్ టైటిళ్ళు ,రెండు అంతర్జాతీయ టైటిళ్ళు (కెన్యా ఓపెన్ 1988 ,1989) విజేత.
ఆమె సాధించిన విజయాలకు గాను 1982లో అర్జున అవార్డు, 2001లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.
సైరస్ పొంచాతో కలిసి భారత మహిళల స్క్వాష్ జట్టుకు కోచ్ గా ఉన్నారు. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్ 2018 కోసం వారు జట్టుకు శిక్షణ ఇచ్చారు.[4]