![]() హ్ందూ ధర్మ సముదాయం వారు నిర్వహిస్తున్న దేవాలయం, థింపు | |
మొత్తం జనాభా | |
---|---|
190,000 (2011) 22.6% of total population | |
మతాలు | |
హిందూమతం |
భూటాన్లో హిందూమతం రెండవ స్థానంలో ఉంది. ప్రకారం, ప్యూ రీసెర్చ్ సెంటర్ 2010 సర్వె ప్రకారం జనాభాలో 22.6% మంది హిందువులు. [1] దీనిని ప్రధానంగా లోత్షాంప జాతి జనులు అనుసరిస్తారు. [2] శైవ, వైష్ణవ, శాక్త, గణపతి, పౌరాణిక, వేద శాఖలు హిందువులలో ప్రబలంగా ఉన్నాయి. దక్షిణ భూటాన్‌లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిందువులు తమ మతాన్ని చిన్న, మధ్య తరహా సమూహాలుగా ఆచరిస్తారు. [3] భూటాన్ జనాభాలో 75% మంది బౌద్ధులు. [4]
భూటాన్ హిందువులకు ప్రధానమైన పండుగ దశైన్. [5] ఇది భూటాన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏకైక హిందూ సెలవుదినం. భూటాన్ రాజు దీనిని 2015 లో సెలవుదినంగా గుర్తించాడు. [6] ఆ సంవత్సరం హిందువులతో కలిసి దశదిన వేడుకలను కూడా జరుపుకున్నాడు. [7] [8] దశైన్ లో మొదటి తొమ్మిది రోజులు దుర్గ, మహిషాసురుల మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీక. పదవ రోజు దుర్గ అతన్ని ఓడించిన రోజు. ఇతర హిందువులు రావణుడిపై రాముడి విజయాన్ని సూచికగా భావిస్తారు. [9] వారు దషైన్ రోజుల్లో సేల్ రోటీ తయారు చేసుకుంటారు.
భూటాన్ హిందూ ధర్మ సముదాయం (HDSB) 2009లో స్థాపించబడిన హిందూ మత సంస్థ. ఇది భూటాన్ మతపరమైన సంస్థల కమీషన్ అయిన ఛోడీ లెంత్‌షాగ్‌లో నమోదైంది. HDSB భూటాన్‌లో ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సనాతన ధర్మ అభ్యాసాలను ప్రోత్సహించడానికి, తద్వారా మానవ విలువలను పెంపొందించడానికీ బలోపేతం చేయడానికీ ఏర్పాటు చేసారు. రాజధాని నగరం థింఫులో దీని ప్రధాన కార్యాలయం ఉంది. సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో ఎన్నుకోబడిన హిందూ పూజారులు, ఇతర HDSB సభ్యుల ప్రతినిధులతో కూడిన వాలంటీర్ల బోర్డు డైరెక్టర్లు సంస్థను నడుపుతారు. [10]
1990లలో భూటాన్ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్, లోత్షాంప హిందువులను తుడిచిపెట్టే దిశగా కృషి చేసాడు. [11] 1990 ల మొదట్లో, దక్షిణ భూటాన్ వాసులు అనేక వేల మందిని, సవరించిన 1985 పౌరసత్వం చట్టం కింద క్షాళన చేసాడు. తల్లిదండ్రుల్లో ఒకరిది నేపాలీ మూలంగా ఉన్న మిశ్రమ జాతికి చెందినవారు కావడమే దీనికి కారణమని చెప్పారు. భారతదేశం లాగానే నేపాల్లో కూడా హిందూ బౌద్ధ సంప్రదాయాలు కలగలిసి ఉంటాయి. అయితే భూటాన్ జనాభాలో ఎక్కువ భాగం బౌద్ధులు. రాజ కుటుంబం శతాబ్దాలుగా అక్కడ స్థిరపడిన హిందూ పౌరుల పట్ల స్పష్టమైన వివక్షను ప్రదర్శించింది. [12]
1990 లలో క్షాళన ప్రారంభించిన తరువాత, 1992 లో తూర్పు నేపాల్లో ఐరాస ఏర్పాటు చేసిన శరణార్థ శిబిరాల్లో భూటాన్ హిందువులు నివసించాల్సిన పరిస్థితిని కల్పించారు. [13] భూటాన్ శరణార్థులలో ఎక్కువ మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో పునరావాసం పొందారు. 30 ఏళ్లకు పైగా నేపాల్‌లోని శిబిరాల్లో నివసిస్తున్న కొద్దిమంది శరణార్థులు ఇప్పటికీ తమ మాతృభూమిని చూడాలనే ఆశతో ఉన్నారు. [14]
బౌద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. సన్యాసులు, మఠాలకు నిధులు అందించింది. [2] హిందూ దేవాలయాలను నిర్మించడానికి ప్రభుత్వం చాలా అరుదుగా అనుమతినిస్తోందని ప్రభుత్వేతర సంస్థలు ఆరోపించాయి. అటువంటి నిర్మాణాల్లో చివరిది 1990ల ప్రారంభంలో, ప్రభుత్వం హిందూ దేవాలయాలు, సంస్కృత, హిందూ విద్యా కేంద్రాల నిర్మాణానికీ, పునర్నిర్మాణానికీ అనుమతించినపుడు జరిగింది. అపుడు ఆ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసింది. [15] హిందూ దేవాలయాల కంటే బౌద్ధ దేవాలయాల కోసం డిమాండు చాలా ఎక్కువగా ఉండటంతో ఇది డిమాండు సరఫరా లకు సంబంధించిన విషయమని ప్రభుత్వం వాదించింది. చాలా మంది హిందువులు నివసించే దక్షిణాదిలోని అనేక హిందూ దేవాలయాలకు తాము సహకారం ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భారతదేశంలో సంస్కృతం చదవుకోడానికి హిందువులకు కొన్ని స్కాలర్‌షిప్‌లను అందించినట్లు కూడా తెలిపింది.
{{cite journal}}
: Cite journal requires |journal=
(help)
{{cite web}}
: CS1 maint: url-status (link)