భేతాళుడు | |
---|---|
దర్శకత్వం | ప్రదీప్ కృష్ణమూర్తి |
రచన | సుజాత రంగరాజన్ ప్రదీప్ కృష్ణమూర్తి జో డి క్రజ్ కార్తీక్ కృష్ణ |
నిర్మాత | ఫాతిమా విజయ్ ఆంటోని |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ప్రదీప్ కలిపురయత్ |
కూర్పు | వీర సెంధిల్ రాజ్ |
సంగీతం | విజయ్ ఆంటోని |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఆరా సినిమాస్ |
విడుదల తేదీ | 1 డిసెంబరు 2016 |
సినిమా నిడివి | 123 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹10 crore (US$1.3 million) |
బాక్సాఫీసు | ₹45 crore (US$5.6 million) |
భేతాళుడు 2016 లో విడుదలైన తమిళ అనువాద తెలుగు చిత్రం. తమిళ చిత్రం సైతాన్ కు ఇది తెలుగు అనువాద సినిమా.[2]
దినేష్ (విజయ్ ఆంటోని) ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. అనాథ అయిన ఐశ్వర్య (అరుంధతిరాయ్) ను పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటున్న దినేష్ జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఎవరో తనను పిలుస్తున్నట్లు, చనిపొమ్మని ప్రేరేపిస్తున్నట్టు దినేష్ అనుభూతిచెందుతాడు. ముందుగా ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో దినేష్ చెప్పడు. కానీ దినేష్ ప్రవర్తనతో చుట్టు పక్కల ఉండేవారు ఇబ్బంది పడుతుంటారు. కొన్ని రోజులకు దినేష్ తన పరిస్థితిని తల్లికి, భార్యకు చెబుతాడు. ఓ మానసిక వైద్యుడిని కలిసి తనకు ఎదువుతున్న అనుభవాలను వివరిస్తాడు. అప్పుడు వైద్యుడు, దినేష్‌ను వశీకరణ చేసి తన గత జీవితం గురించి ప్రశ్నించడం మొదలు పెడతాడు. అప్పుడు జయలక్ష్మి గురించి దినేష్ వైద్యుడుకు చెబుతాడు. ఇంతకు జయలక్ష్మి ఎవరు? అసలు దినేష్‌కు వింతగా ప్రవర్తించడానికి కారణం ఎవరు? శర్మ ఎవరు? శర్మకు, దినేష్‌కు ఉన్న సంబంధం ఏమిటి? దినేష్ సమస్యలకు ఐశ్వర్యకు ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకు భేతాళుడు ఎవరు? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.[3]