మంతన్ | |
---|---|
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
రచన | కైఫీ ఆజ్మీ (మాటలు) |
స్క్రీన్ ప్లే | విజయ్ టెండూల్కర్ |
కథ | వర్గీస్ కురియన్ & శ్యామ్ బెనగళ్ |
నిర్మాత | గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. |
తారాగణం | స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి |
ఛాయాగ్రహణం | గోవింద్ నిహాలని |
కూర్పు | భానుదాస్ దివాకర్ |
సంగీతం | వన్ రాజ్ భాటియా |
విడుదల తేదీ | 1976(భారతదేశం) |
సినిమా నిడివి | 134 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మంథన్ 1976లో విడుదలైన హిందీ చలనచిత్రం. క్రౌడ్ ఫండింగ్ విధానంలో 500,000 మంది రైతులు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున ఇచ్చిన విరాళంతో శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి తదితరులు నటించారు.[1] 1977లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (విజయ్ టెండూల్కర్) పురస్కారాలను అందుకుంది. 1976లో ఉత్తమ విదేశి చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు పంపించడం జరిగింది.[2]
గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని పేద రైతులు సమిష్టిగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటారు. స్థానిక సామాజిక కార్యకర్త త్రిభువన్‌దాస్ పటేల్ వంటి నాయకుల ఆధ్వర్యంలో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడుతుంది.
గుజరాత్‌లోని ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘాలు ఏర్పాటుచేయబడి, 1946లో గుజరాత్‌లోని ఆనంద్‌లో పాల సహకార సంస్థ అమూల్ ఏర్పడటానికి దారితీసింది. చివరికి,1970లో నేషన్‌వైడ్ మిల్క్ గ్రిడ్ ను సృష్టించడం ద్వారా భారతదేశంలో శ్వేత విప్లవం ప్రారంభానికి దారితీసింది. ఈ నేపథ్యం ఆధారంగా సినిమా తీయబడింది.