మంద జగన్నాథ్ | |||
| |||
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
| |||
పదవీ కాలం 2022-2023 నవంబరు (తెలంగాణ రాష్ట్ర సమితి) | |||
మాజీ ఎం.పి.
| |||
పదవీ కాలం 1999-2008 (తెలుగుదేశం పార్టీ), 2008-2013 (భారత జాతీయ కాంగ్రెస్), 2013-2014 (తెలంగాణ రాష్ట్ర సమితి) | |||
ముందు | మల్లు రవి | ||
---|---|---|---|
తరువాత | నంది ఎల్లయ్య | ||
నియోజకవర్గం | నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇటిక్యాల, నాగర్‌కర్నూల్ తెలంగాణ | 1951 మే 22||
రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి , భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సావిత్రి | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కూతురు | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ | ||
మతం | హిందూ |
మందా జగన్నాథం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, 11వ, 13వ, 14వ, 15వ పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.[1] ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[2]
మంద జగన్నాథ్ 1951, మే 22న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇటిక్యాలలో జన్మించాడు. తండ్రి పేరు పెద్ద పుల్లయ్య. వైద్య విద్యలో ఎం.ఎస్. పూర్తి చేశాడు.
మంద జగన్నాథ్ కు సావిత్రిలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు.
తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికైన 5మంది ఎంపీలలో మంద జగన్నాథ్ ఒకరు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటూ, పార్టీ నిర్ణయాలలో పాల్గొనేవాడు. పార్టీ విప్ కి విరుద్దంగా ఓటు వేసినందుకు సోమనాథ్ చటర్జీ చేత బహిష్కరణకు గురయ్యాడు. 2008, డిసెంబరు 20న జగన్నాథ్ న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడ్డారు. 1999-2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ లో, 2008-2013 మధ్యకాలంలో భారత జాతీయ కాంగ్రెస్ లో, 2013-2014 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేశాడు.[3] ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు ఆ తరువాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.
2022 జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేత నియమించబడిన జగన్నాథ్, జూలై 6న ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో బాధ్యతలను స్వీకరించాడు.[4] ఆయన 2023 నవంబరు 17న బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూల్ లోక్‌సభ సీటు ఇవ్వకపోవడంతో రాజస్థాన్ లోని ఆళ్వార్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు.[5]
గెలుపు
ఓటమి
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)