మగధీరుడు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయబాపినీడు |
---|---|
నిర్మాణం | మాగంటి రవీంద్రనాథ చౌదరి |
తారాగణం | చిరంజీవి , జయసుధ , రోజారమణి |
సంగీతం | ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | శ్యాంప్రసాద్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
మగధీరుడు 1986 లో విజయ బాపినీడు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, జయసుధ ముఖ్యపాత్రల్లో నటించారు.[1]
చిరు, సత్యనారాయణ చిన్న కుమారుడు. మధ్యతరగతి అమ్మాయి (జయసుధ) తో ప్రేమలో పడి అతని అన్నలూ అక్కలూ అంగీకరించకపోయినా ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. అసూయతో అక్కలు, ఆస్తిని కాజేయడానికి గోతి కాడ నక్కలా కూర్చున్న రావు గోపాలరావు సహాయంతో, కొత్త కోడలికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలుసుకుని సత్యనారాయణ గుండెపోటుతో మరణిస్తాడు. అన్నలు ఆస్తి కోసం తగువులాడుకుంటారు. చిరు, జయసుధ ఖాళీ చేతులతో ఇంటి నుండి బయటికి వెళ్తారు., కాని చిరు ఒక పరిస్థితిలో జైలుకు వెళతాడు. జయసుధ ఒంటరిగా మిగిలిపోతుంది. కుటుంబమంతా చెల్లాచెదురైపోతుంది. జైలు నుండి బయటకు వచ్చి చిరు తన కుటుంబాన్ని ఎలా ఏకం చేస్తాడనేది మిగతా కథ.
దర్శకుడు: విజయబాపినీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
నిర్మాణ సంస్థ: శ్యాంప్రసాద్ ఆర్ట్స్
సంగీతం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, ఆత్రేయ, గుర్రం జాషువా, బలిజేపల్లి లక్ష్మీకాంతం
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, ఎస్ జానకి, ఎం రమేష్, మంజుల
విడుదల:1986: మార్చి:7.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.