![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మాజిద్ జహంగీర్ ఖాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లూథియానా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1946 సెప్టెంబరు 28|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 44) | 1964 అక్టోబరు 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1983 జనవరి 23 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 4) | 1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1982 జూలై 19 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 4 |
మాజిద్ జహంగీర్ ఖాన్ (జననం 1946, సెప్టెంబర్ 28), పాకిస్తాన్ మాజీ క్రికెటర్, బ్యాట్స్‌మన్. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. 1961 నుండి 1985 వరకు 18 సంవత్సరాల పాటు సాగిన అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో, పాకిస్తాన్ తరపున 63 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 8 సెంచరీలతో 3,931 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 27,000 పరుగులు (73 ఫస్ట్ క్లాస్ సెంచరీలు, 128 ఫిఫ్టీలతో) చేశాడు.[1] 1983 జనవరిలో భారత్‌తో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో తన చివరి టెస్టును ఆడాడు.[2] 1982 జూలైలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో చివరి వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు.[3] లాహోర్ ఎడ్యుకేషన్ బోర్డ్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.
మాజిద్ జహంగీర్ ఖాన్ 1946, సెప్టెంబరు 28న బ్రిటీష్ ఇండియా, పంజాబ్‌లోని లూథియానాలో బుర్కీ పష్టూన్ కుటుంబంలో జన్మించాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో పెరిగాడు. ఇతని తండ్రి, జహంగీర్ ఖాన్, 1947లో భారతదేశ విభజనకు ముందు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇతను పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బంధువు.
1964లో, ఆస్ట్రేలియాతో కరాచీలోని నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ ఆడాడు.[4] 1976-77 టెస్ట్ సిరీస్ సమయంలో కరాచీలో న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు లంచ్‌కు ముందు సెంచరీ చేసిన ఆరుగురు బ్యాట్స్‌మెన్ (మిగతా ఐదుగురు ట్రంపర్, మాకార్ట్నీ, బ్రాడ్‌మన్, వార్నర్, శిఖర్ ధావన్ ) మజీద్ ఖాన్ ఒకడు. ఇతను 78 బంతుల్లో 108 నాటౌట్ గా నిలిచాడు.[5][6][7] 1973లో న్యూజిలాండ్‌లోని లాంకాస్టర్ పార్క్‌లో న్యూజిలాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేశాడు.[8] 1974, ఆగస్టు 31న ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో పాకిస్తాన్ తరపున మొదటి వన్డే సెంచరీ చేసిన ఏకైక గౌరవాన్ని కూడా కలిగి ఉన్నాడు.[9][10][11] ఖాన్ 93 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 109 పరుగులు చేసి పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు.[9][10]
అంతర్జాతీయ క్రికెట్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌లో అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డాడు. 1990ల మధ్యలో బోర్డు సీఈఓ అయ్యాడు.[12] 1993లో పాకిస్థాన్‌కు చీఫ్ సెలక్టర్‌గా ఉన్నాడు. 1995లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లకు మ్యాచ్-రిఫరీగా వ్యవహరించాడు. పాకిస్తాన్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కానీ 1999 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో రాజీనామా చేశాడు.