మణిమహేశ్ సరస్సు | |
---|---|
![]() | |
ప్రదేశం | మణి మహేశ్ రేంజ్, హిమాచల్ ప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 32°23′42″N 76°38′14″E / 32.39500°N 76.63722°E |
వెలుపలికి ప్రవాహం | మణిమహేశ్ గంగా |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల ఎత్తు | 4,190 మీ. (13,750 అ.) |
ఘనీభవనం | అక్టోబర్ నుండి జూన్ వరకు |
మణిమహేష్ సరస్సును దాల్ సరస్సు అని కూడా అంటారు. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో గల భర్మూర్ ప్రాంతంలోని హిమాలయాలలోని పిర్ పంజాల్ శ్రేణిలో, మణిమహేష్ కైలాష్ శిఖరానికి సమీపంలో ఉంటుంది. ఇది 4,080 మీటర్ల (13,390 అడుగులు) లోతు కలిగి ఉంది. టిబెట్ ప్రాంతం లోని మానస సరోవర్ సరస్సు ఈ సరస్సు పక్కనే ఉంటుంది.[1]
ఆగస్టు / సెప్టెంబర్ నెలలలో అత్యంత ప్రతష్టాత్మకంగా ఈ సరస్సు దగ్గర ఉత్సవాలు జరుగుతాయి. దీనిని ‘మణిమహేష్ యాత్ర’ అంటారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్రస్థాయి తీర్థయాత్రగా ప్రకటించింది.[2]
శబ్దవ్యుత్పత్తి శాస్త్రం ప్రకారం మహేష్ అంటే మహేశ్వరుడిగా పిలుచుకునే శివుడు అని అర్థం. ఈ సరస్సును శివుడి కిరీటం పై గల ఆభరణం గా పిలవబడుతుంది కాబట్టి దీనికి మణి మహేశ్ సరస్సు అని పేరు వచ్చింది.[1][3]
సరస్సుకి రెండు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. ఒకటి హద్సర్ గ్రామానికి చెందినది, ఇది సాధారణ యాత్రికులకు సులభమైన మార్గం. ఈ మార్గంలో ప్రాథమిక అవసరాలైన ఆహారం, వసతి మొదలైన వాటి కోసం తగిన ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. మరొకటి హోలీ గ్రామానికి చెందినది, ఈ మార్గం గుండా చాలా సాహసోపేతమైన వారు మాత్రమే వెళ్ళగలరు. ఈ మార్గంలో ఒక చిన్న గ్రామం తప్ప వేరే నివాసం ఉండదు.[4][5]
పురాణాల ప్రకారం, శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న తరువాత మణిమహేశ్వరుడిని సృష్టించాడని నమ్ముతారు. ఈ సరస్సు చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి.
మణి మహేష్ శిఖరంపై పడే ఉదయపు సూర్యకిరణాల వలన సరస్సు కుంకుమ తిలకం దిద్దుకున్నట్టు కనిపిస్తుంది. దీనిని ప్రజలు ప్రదర్శనగా చూడటానికి పోటెత్తుతారు.[6]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite book}}
: |work=
ignored (help)