మణివణ్ణన్ | |
---|---|
மணிவண்ணன் | |
జననం | మణివణ్ణన్ 1953 జూలై 31 సులూర్, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం) ) |
మరణం | 2013 జూన్ 15[1][2] కళా కురుచి, తమిళనాడు, భారతదేశం | (వయసు 59)
వృత్తి | సినిమా నటుడు, దర్శకుడు, రచయిత, తమిళ ఉద్యమకారుడు, సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1978–2013 |
రాజకీయ పార్టీ | NTK |
జీవిత భాగస్వామి | సెంగమలం |
పిల్లలు | జ్యోతి, రఘువణ్ణన్ |
పురస్కారాలు | జాతీయ పురస్కారం, 2016 |
ఎస్. మణివన్నన్ రాజగోపాల్ (1953 జూలై 31 - 2013 జూన్ 15 ) మణివణ్ణన్ గా గుర్తింపు పొందాడు. అతను భారతీయ సినీ నటుడు, దర్శకుడు, తమిళ ఉద్యమకారుడు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో నటుడిగా మారడానికి ముందు అతను 1980 నుండి 82 వరకు దర్శకుడు భారతీరాజాకు కథ, సంభాషణ రచయితగా పనిచేసి, తరువాత విభిన్న ప్రక్రియలతో ప్రయోగాలు చేయడంలో అభివృద్ధి చెందిన విజయవంతమైన దర్శకుడిగా మారాడు.[3] అతని పేరుతో 400 సినిమాలలో మణివణ్ణన్ ఈ రంగంలో అత్యంత అనుభవంతులైన నటులలో ఒకనిగా గుర్తింపు పొందాడు. అతను 50 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[4] మణివణ్ణణ్ ప్రధానంగా చిత్రాలలో సహాయక నటుడు, తరచూ హాస్యనటుడు, విలన్ పాత్రను పోషించాడు.[3]
తన జీవితకాలంలో ద్రావిడ మున్నేట్ర కజగం, మరుమలార్చి ద్రావిడ మున్నేట కజగం సహా వివిధ రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చాడు. తరువాత అతను నామ్ తమిలార్ కచ్చి తో అనుబంధం పెంచుకుని, శ్రీలంక తమిళ జాతీయవాదం భావజాలానికి చాలాకాలంగా మద్దతు ఇచ్చాడు.
మణివన్నన్ సులూర్ లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో చేరాడు.[5] కోవైలో తన పూర్వ విశ్వవిద్యాలయ కోర్సు పూర్తిచేస్తున్నప్పుడు, సత్యరాజ్‌తో పరిచయం ఏర్పడి వారిద్దరూ స్నేహితులు అయ్యారు. సత్యరాజ్ చెప్పిన ప్రకారం, అతను మణివణ్ణణ్ కు పేలవమైన మార్గదర్శకత్వం అందించి, ఆధునిక ఆంగ్ల భాషా మాధ్యమంలో చరిత్రలో డిగ్రీని పొందేలా చేశాడు. ఇది షేక్స్‌పియర్ వంటి అంశాలను నేర్చుకోవడానికి కష్టమైంది. అందువలన అతను విద్యాభ్యాసాన్ని మధ్యలో వదిలివేసాడు.[6] కాలేజీలో ఉన్నప్పుడు, మణివణ్ణణ్ రంగస్థల నటనపై ఆసక్తితో కొన్ని ప్రదర్శనలు ఇచ్చాడు. కిజాకే పోగం రైల్ (1978) చిత్రం తనపై చూపిన ప్రభావంతో ప్రేరణ పొందిన అతను చిత్రనిర్మాత భారతీరాజాకు అభిమానిగా ఉత్తరం రాశాడు. ఆ లేఖ వందకు పైగా పేజీలతో ఉంది.[7] [8] భారతీరాజా అతన్ని అప్రెంటిస్‌గా తన వద్ద చేర్చుకున్నాడు. మణివణ్ణణ్ 1979 లో భారతీరాజా శిబిరంలో చేరాడు.[9]
అతను 1980–82 మధ్యకాలంలో తన గురువుల చిత్రాలైన నిజాల్గల్, టిక్ టిక్ టిక్, అలైగల్ ఓవతిళ్ళై, కాదల్ ఓవియం లకు కథ, సంభాషణలు రాశాడు.[10] రాజేష్ ఖన్నా నటించిన రెడ్ రోజ్ (హిందీ), లవర్స్ (హిందీ), కొత్త జీవితాలు (తెలుగు) వంటి కొన్ని చిత్రాలలో మణివణ్ణణ్ భారతీరాజాకు సహాయం చేసాడు. భారతిరాజా ఆధ్వర్యంలో రెండేళ్ళలో కష్టపడి వేగంగా దర్శకత్వ మెళకువలను నేర్చుకుని 1982 నాటికి అతను స్వంతంగా దర్శకత్వం వహించాడు. మోహన్, ప్రభు నటించిన లాటరీ టికెట్, కార్తీక్ నటించిన అగయ గంగై, అజిత్ కుమార్ నటించిన నేసం వంటి ఇతర చిత్రాల కోసం అతను కథ, సంభాషణలు కూడా రాశాడు. భారతీరాజా దర్శకత్వం వహించిన కోడి పరకుతు చిత్రంలో మణివణ్ణణ్ ప్రతినాయకుని పాత్ర పోషించాడు.
మణివణ్ణణ్ తమిళంలో 50 చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ, బాక్స్ ఆఫీస్ విజయాలుగా సుమారు 34 చిత్రాలను కలిగి ఉన్నప్పటికీ, అతను ప్రజలలో తన నటనా నైపుణ్యానికి గుర్తింపు పొందాడు. అతను వివేకవంతమైన, స్వభావసిద్ధమైన పాత్రలలోనటించి ప్రత్యేకంగా పరిగణించబడ్డాడు. శివాజీ గణేషన్, కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్, కార్తీక్, మోహన్, మాధవన్, విజయ్, అజిత్ కుమార్, సూర్య తదితరులతో పాటు పలువురు తారలతో కలిసి నటించాడు. 400 కి పైగా చిత్రాల్లో నటించాడు. అతను దర్శకత్వం వహించిన అమైధి పాడై సినిమా ద్వారా అతను నటుడిగా ముందుకు కొనసాగాలని భావించాడు. అతను ఖరీదైన ఆఫర్లను పొందడం ప్రారంభించాడు. అతను 1990–2011 నుండి సంవత్సరానికి ముప్పై చిత్రాలలో నటించాడు.
మణివణ్ణణ్ తెలుగు, మలయాళం, హిందీ భాషలలో కొన్ని వెంచర్లతో సహా 50 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[11] దర్శకుడిగా రొమాన్స్ నుండి థ్రిల్లర్ వరకు, దాని నుండి డ్రామా వరకు విభిన్న ప్రక్రియలలో సినిమాలు చేశాడు.[12] అతను 1982 లో గోపురంగల్ శైవతిలైతో దర్శకత్వం చేయడం ప్రారంభించాడు.[13] హిందూ పత్రికలో తన చిత్రం అమైధి పాడై (1994) "తమిళ సినిమాలో రాజకీయ వ్యంగ్యానికి ప్రమాణాలను నిర్ణయించింది" అని ప్రచురించారు[12]. 2013 లో అమైధి పాడైకి కొనసాగింపుగా తన 50 వ , చివరి చిత్రం నాగరాజ చోలన్ ఎంఏ, ఎమ్మెల్యే కు దర్శకత్వం వహించాడు.[14] మణివణ్ణణ్ తన ప్రాన స్నేహితుడైన సత్యరాజ్ కు 25 మంచి చిత్రాలలో దర్శకత్వం వహించాడు.[15] తమిళ చిత్రాల దర్శకుడిగా సత్యరాజ్ ప్రధాన కథానాయకుడిగా వరుసగా 12 విజయవంతమైన సినిమాలనిచ్చాడు. అవి జల్లికట్టు, చిన్న తంబి పెరియా తంబి, గణమ్ కోర్తార్ అవర్గలే, మణిధన్ మారివిట్టన్, ఉల్లాతిల్ నల్లా ఉల్లాం, వాఖ్కమ్ మణితన్, థర్కు థెరు మచన్, గవర్నమెంట్ మాపిల్లై, అమైధిపాడై.[16]
మణివణ్ణణ్ మొదట ద్రావిడ మున్నేట్ర కఝగం (డిఎంకె) కు బలమైన మద్దతుదారుడు. ఎందుకంటే అతని తండ్రి ఆర్ ఎస్ మణియం సులూర్ డిఎంకె పట్టణ కార్యదర్శి. అందువల్ల మణివణ్ణణ్ ద్రావిడ ఉద్యమం భావజాలంపై ఆసక్తిని పెంచుకున్నాడు. అయితే, తరువాత అతను మార్క్సిస్ట్, నక్సలైట్ ఉద్యమంలో కార్యకర్త అయ్యాడు.[17] తన తండ్రితో కూడా రాజకీయ విభేదాలు ఉండేవి[17].
మణివణ్ణణ్ తమిళ దేశభక్తునిగా మారుమలార్చి ద్రావిడ మున్నేట కజగం (ఎండిఎంకె) రాజకీయ పార్టీలో చేరి 2006 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారి కోసం ప్రచారం చేశాడు[18]. తరువాత నామ్ తమిలార్ కచ్చిలో చేరాడు[19]. అతను తమిళ ఈలం మద్దతుదారుగా ఉన్నాడు. మణివణ్ణణ్ ఒకసారి ఇలా అన్నాడు: "నేను తమిళ ఈలంలో జన్మించినట్లయితే, నేను ఖచ్చితంగా తమిళ ఈలం విముక్తి పులులలో ఒక యోధునిగా చేరి ఈలం కోసం నా జీవితాన్ని త్యాగం చేసేవాడిని. నేను తమిళనాడులో జన్మించినందున నాలో ఈలం భావన ఉంది" .[20]
మణివణ్ణన్ కోయంబత్తూరు జిల్లాలోని సులూర్ అనే చిన్న పట్టణానికి చెందినవాడు[21]. అతని తండ్రి బియ్యం వ్యాపారి, వస్త్ర వ్యాపారి ఆర్.ఎస్.మణియం. అర్.ఎస్. మణియం కోయంబత్తూర్, మరగతం లోని రాజకీయ నాయకుడు, ఎన్నికలలో పోటీ చేసి పంచాయతీలో ఒక సీటు గెలుచుకున్నాడు. మణివణ్ణన్ సెంగమలం ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు రఘు ఉన్నారు. అతని కుమారుడు చిత్రాలలో నటిస్తున్నాడు. రఘువణ్ణణ్ గా గుర్తింపు పొందాడు.[21]
మణివణ్ణణ్ తన 50 వ దర్శకత్వం వహించిన నాగరాజ చోలన్ ఎంఏ, ఎమ్మెల్యేను విడుదల చేసిన స్వల్ప వ్యవధిలో కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగా 2013 జూన్ 15 న తన 59 సంవత్సరాల వయసులో చెన్నైలోని తన నేసాపక్కం నివాసంలో మరణించాడు.[22] అతని కోరిక మేరకు అతని మృతదేహానికి తమిళ ఈలం జెండాలో చుట్టి ఉంచారు[23]. అతను మరణించిన రెండు నెలల తరువాత అతని భార్య 15 ఆగస్టు 2013 న మరణించింది[24][25].
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)