మణిశంకర్ | |
---|---|
జననం | శంకర్ మణి 1957 ఆగస్టు 3 గుంటూరు, భారతదేశం |
విద్య | హైదరాబాదు పభ్లిక్ స్కూలు |
విద్యాసంస్థ | బిట్స్ పిలానీ |
వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, వ్యాపారవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
పిల్లలు | ప్రేమ్ శంకర్ |
మణి శంకర్ బాలీవుడ్ సినిమా దర్శకుడు, హాలోగ్రఫిక్ సాంకేతిక నిపుణుడు, రచయిత, వక్త. అతడు 2012 లో గుజరాత్ శాసనసభ ఎన్నికలలో నరేంద్ర మోదీ కొరకు హాలోగ్రాఫిక్ విధానంలో రాజకీయ ప్రచారాన్ని రూపకల్పన చేసాడు. ప్రపంచంలో అటువంటి విధానం రూపకల్పన చేసిన మొదటి వ్యక్తిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు పొందాడు.[1]
బాలీవుడ్ దర్శకునిగా అతడు "16 డిసెంబరు"తో పాటు ఐదు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అతని జీవితంలో అనేక చిత్రాలను, ప్రకటనలను, రాజకీయ నాయకుల కొరకు ఎన్నికల ప్రచారాలను చేసాడు.[2]
మణిశంకర్ 1978లో బిట్స్ పిలానీ నుండి కెమికల్ ఇంజనీరింగులో గ్రాడ్యుయేషన్ చేసాడు.[3] ప్రాజెస్ ఇంజనీరు, డ్రగ్ డెలివరీ లలో పరిశోధనా ఇంజనీరుగా ఐదు సంవత్సరాలు పనిచేసాడు.
రెండు దశాబ్దాల సినిమా పరిశ్రమలోఅనుభవంతో అతడు సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాడు. స్వంత ప్రొడక్షన్ హౌస్ "భైరవి ఫిల్మ్స్"ను ప్రారంభించాడు. సుమారు 1000 ప్రకటనల చిత్రాలను, లఘు చిత్రాలను, 5 హిందీ సినిమాలను నిర్మించాడు.
అతడు తీసిన లఘు చిత్రాలలో అత్యధిక చిత్రాలు సమాజంపై అతనికి గల నిబద్ధతను తెలియజేస్తాయి. ప్రేక్షకులను ఆత్మ శోధన చేసేటట్లు ఉంటాయి. 1991లో చిత్రీకరించిన "మనిషి" తెలుగు చలన చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారాన్ని పొందింది. అదే విధంగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథా రచయితగా కూడా నంది పురస్కారాలను పొందాడు. అతని హిందీ చలన చిత్రం "16 డిసెంబరు" 2002 లో అత్యధిక వసూళ్ళు పొందిన 10 చిత్రాలలోఒకటిగా నిలిచింది.
తన మనస్సాక్షితో స్థిరమైన యుద్ధం చేస్తున్న సైనికుని కథ "టాంగో చార్లీ". ఇది అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. ఇది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ క్లాసిక్ యాంటీ వార్ చిత్రాల జాబితాలో చేర్చబడింది.
కాలజ్ఞాన అతీంద్రియ చిత్రం "రుద్రాక్ష్" సంజయ్ దత్, బిపాషా బసు, సునీల్ శెట్టి, ఇషా కోపికర్ తారాగణంతో నిర్మింపబడింది.
"ముఖ్‌బీర్" ఓంపురి, సునీల్ శెట్టి, సమీర్ దత్తాని, రీమాసేన్ తారాగణంతో తీసిన చిత్రం. ఈ చిత్రంలో యువకుడు ప్రమాద కరమైన అండర్ వరల్డ్ లోనికి వెళ్ళి దేశభక్తునిగా మరణించడానికి నిర్ణయించుకున్నాడు. ఇది కూడా బెర్లిన్ లోని బ్లాక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో విమర్శకుల ప్రసంశలు పొందింది, ప్రదర్శించబడింది.
"నాక్ అవుట్" సంజయ్ దత్, ఇర్ఫాన్ ఖాన్, కంగన రనౌత్ తారాగణంగా నిర్మితమైన చిత్రం.
మణిశంకర్ భారతదేశంలో హాలోగ్రాం లను పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతడు మొదటి హాలోగ్రాఫిక్ ప్రచారాన్ని మొట్టమొదట ప్రారంభించాడు. భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో 2012 గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఈ హాలోగ్రాఫిక్ ప్రచారం చేసాడు.[4] అతడు 2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల లో తెలంగాణ రాష్ట్ర సమితి వంటి వివిధ పార్టీలకు ఎన్నికల ప్రచారాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాడు.[5] అదే విధంగా 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసాడు కానీ పార్టీ, దాని మిత్రపక్షాలపై పనిచేసే ప్రబలమైన వ్యతిరేక-అవినీతికి ఆరోపణలున్నందున పార్టీ పరాజయానికి కారణమైంది.[6]
2017లో మణిశంకర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫాడ్నవీస్ రాజకీయ ప్రచారం కొరకు వాస్తవ అభివృద్ధి పై ఐదు ప్రత్యక్ష కార్యక్రమాలను నిర్వహించాడు. ఇది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి ఓట్లను రాబట్టడానికి ప్రజల ఇళ్లలోకి ప్రవేశించేందుకు దోహదపడింది. ఓటర్లు కూడా అభ్యర్థితో సెల్ఫీ పోటోలు తీసుకొని సామాజిమ మాధ్యామాలలో పోస్టు చేసారు.[7] ఈ కార్యక్రమం విజయం సాధించింది. AR (ఆర్గ్యుమెంట్ రియాలిటీ) ఒక రాజకీయ ప్రచార సాధనంగా ఏర్పడింది.[8] సినిమా ప్రచారం, క్రీడలు, ఆధ్యాత్మికత, కార్పొరేట్ రంగాలలో జీవిత కాల పరిమాణంలో ఎ.ఆర్ ప్రాజెక్టుల పరంపర కొనసాగింది. ఆర్గ్యుమెంట్ రియాలిటీలో వివిధ రకాల ప్రచార, కమ్యూనికేషన్ ప్రయోజనాల కొరకు ప్రముఖ సెలబ్రిటీలుగా ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చిదానంద స్వామి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, సినిమా నటుడు దగ్గుబాటి రానా ఉన్నారు.[9]