మథిలుకల్ | |
---|---|
దర్శకత్వం | అడూర్ గోపాలక్రిష్ణన్ |
రచన | అడూర్ గోపాలక్రిష్ణన్ |
దీనిపై ఆధారితం | వైకోమ్ ముహమ్మద్ బషీర్ మథిలుకల్ నవల అధారంగా |
నిర్మాత | అడూర్ గోపాలక్రిష్ణన్ |
తారాగణం | మమ్ముట్టి మురళి రవి వల్లథోల్ శ్రీనాథ్ |
ఛాయాగ్రహణం | మంకాడ రవివర్మ |
కూర్పు | ఎం. మణి |
సంగీతం | విజయ రామన్ |
పంపిణీదార్లు | జూబ్లీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1990, మే 18 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
మథిలుకల్, 1990 మే 18న విడుదలైన మలయాళ సినిమా. వైకోమ్ ముహమ్మద్ బషీర్ స్వీయచరిత్ర మథిలుకల్ నవల అధారంగా అడూర్ గోపాలక్రిష్ణన్ రచించి, దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా ఇది.[1] వైకుం మహమ్మద్ బషీర్ పాత్రలో మమ్ముట్టి నటించగా, కెపిఎసి లలిత కథానాయిక నారాయణికి గాత్రదానం చేసింది. మురళి, రవి వల్లథోల్, శ్రీనాథ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వెనిస్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 1990లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా నాలుగు అవార్డులను గెలుచుకుంది.
2013, ఏప్రిల్ నెలలలో జరిగిన భారతీయ సినిమా శతదినోత్సవం సందర్భంగా, ఫోర్బ్స్ పత్రిక ఈ సినిమాలోని మమ్ముట్టి నటనను "భారతీయ సినిమాలోని 25 గొప్ప నటనా ప్రదర్శనల" జాబితాలో చేర్చింది.[2]
వైకం ముహమ్మద్ బషీర్ జైలు జీవితం, జైలులోని మహిళా ఖైదీ నారాయణి మధ్య ప్రేమపై నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ఆమె సినిమా అంతటా కనిపించకుండా ఉంటుంది.[3]
ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఈ క్రింది అవార్డులను గెలుచుకుంది: