Medieval Cholas | |
---|---|
848 CE–1070 CE | |
Map showing the extent of the Chola empire | |
రాజధాని | Pazhaiyaarai, Thanjavur, Gangaikonda Cholapuram |
అధికార భాషలు | Tamil |
మతం | Hinduism (predominantly Shaivism) |
ప్రభుత్వం | Monarchy |
King | |
• 848–871 | Vijayalaya Chola |
• 1067–1070 | Athirajendra Chola |
చారిత్రిక కాలం | Middle Ages |
• స్థాపన | 848 CE |
• Rise of the medieval Cholas | 848 CE |
• Empire at its greatest extent | 1030 CE |
• పతనం | 1070 CE |
Today part of | India Maldives Sri Lanka Singapore Indonesia Thailand Cambodia Malaysia Bangladesh Myanmar Vietnam |
సా.శ. 9 వ శతాబ్దం మధ్యలో మధ్యయుగ చోళులు ప్రాముఖ్యత పొందారు. వీరు భారతదేశం గొప్ప సామ్రాజ్యాలలో ఒకదాన్ని స్థాపించారు. వారు తమ పాలనలో దక్షిణ భారతదేశాన్ని ఏకం చేయడంలో విజయవంతం అయ్యారు. వారి నావికాబలం ద్వారా ఆగ్నేయాసియా శ్రీలంకలలో తమ ప్రభావాన్ని విస్తరించారు. వారు పశ్చిమాన అరబ్బులతో తూర్పున చైనీయులతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారు.
మధ్యయుగ చోళులు, చాళుక్యులు వెంగీ నియంత్రణ మీద నిరంతరం సంఘర్షణలో ఉన్నారు. సంఘర్షణలు చివరికి రెండు సామ్రాజ్యాలను బలహీనం చేసి అది వారి క్షీణతకు దారితీసింది. చోళ రాజవంశం దశాబ్దాల పొత్తులు కొనసాగించిన తరువాత వేంగి తూర్పు చాళుక్య రాజవంశంలో విలీనం అయ్యింది.
పార్థిబచోళుడు (మ .650) ఉరయూరును కేంద్రంగా చేసుకుని చిన్న చోళ రాజ్యాన్ని పరిపాలించారు. ఇది వాతాపి వద్ద చాళుక్య యుద్ధంలో పాల్గొనకపోవటానికి చోళులు భాగస్వామ్యం వహించని కారణంగా పూర్తిగా నరసింహ పల్లవను చేత స్వాధీనం చేసుకోబడింది. తరువాత ఇది పల్లవ పాలనలోకి తీసుకురాబడింది. తరువాత ఇది పార్ధిబచోళుడి కుమారుడు విక్రమచోళుడు (c.664) పునరుద్ధరించబడింది. ఆయన నరసింహ పల్లవను కుమార్తె కుందవైను వివాహం చేసుకుని చోళరాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని తరువాత ఉరైయూరు కేంద్రంగా పరిపాలించిన స్వతంత్ర చోళుడు అయ్యాడు. విజయాలయచోళుడు బహుశా పల్లవ సామతుడై ఉండవచ్చు. పాండ్య, పల్లవుల మధ్య జరిగిన యుద్ధాన్ని అవకాశంగా ఉపయోగించుకుని 848 లో విజయాలయచోళుడు తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు. మొదటి ఆదిత్య నేతృత్వంలోని చోళులు ఉత్తరాన పల్లవులను స్వాధీనం చేసుకున్నారు (మ. 869), దక్షిణాన పాండ్యులను, చేరాలను లొంగదీసుకున్నారు. (మ .903). మొదటి పరంతకచోళుడు పాండ్యులను వారి భూభాగాల నుండి తరిమివేసి 910 లో శ్రీలంకను స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తర రాజ్యాలు, గంగాలు ప్రారంభచోళ సామ్రాజ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించారు. చోళ యువరాజు రాజదిత్య 949 లో తక్కోలం యుద్ధంలో చంపబడ్డాడు. పరాంతకకు సుదీర్ఘకాలం పాలన సాగించాడు. ఆయన 950 లో మరణించినసమయంలో ఆయన రెండవ కుమారుడు గండరాదిత్య రాజు అయ్యాడు. గండరాదిత్య కుమారుడు ఉత్తమచోళుడి వాదనలను పట్టించుకోకుండా అరింజయ కుమారుడు సుందరచోళుడు రాజ్యం పగ్గాలు చేపట్టడానికి ముందు కొంతకాలం ముందు చోళసింహాసనం గండరాదిత్య తమ్ముడు అరింజయ స్వాధీనంలో ఉంది.
సుందరచోళుడి పాలనలో చోళశక్తి కోలుకుంది. యువరాజు ఆదిత్యకరికాల ఆధ్వర్యంలో చోళసైన్యం పాండ్యులను ఓడించి ఉత్తరాన తోండైమండలం వరకు దాడి చేసింది. ఉత్తమచోళుడి చేత అమలు చేయబడిందని అనుమానించబడిన రాజకీయ కుట్రలో ఆదిత్యకరికాల హత్య జరిగింది. ఉత్తమచోళుడు సుందర చోళుడిని ఆయన వారసుడిగా ప్రకటించమని వత్తిడి చేసి 970 లో అధికార పగ్గాలు చేపట్టాడు.
ఉత్తమచోళుడి తరువాత సుందరచోళుడి కుమారుడు రాజరాజచోళుడు 985 లో అధికారంలోకి వచ్చాడు. రాజరాజచోళుడు, ఆయన కుమారుడు రాజేంద్రచోళుడి పాలనలో చోళుల ప్రభావం ఆగ్నేయాసియా అంతటా వ్యాపించింది. రాష్ట్రకూటుల చివరి అవశేషాలను తొలగించి రాజరాజుచోళుడు ఉత్తరాన చోళరక్షణను పటిష్ఠం చేశాడు. చోళులతో నిరంతరం సంఘర్షణలో ఉన్న చాళుక్యుల స్థానంలో రాష్ట్రకూటులను నియమించారు. రాజరాజచోళుడు త్వరలోనే తన రాజ్యాన్ని విదేశాలైన లంకకు విస్తరించాడు. చోళసైన్యం 993 లో ద్వీపం ఉత్తర భాగాన్ని ఆక్రమించింది. రాజరాజచోళుడు తన మేనల్లుడు శక్తివర్మనుకు సింహాసనాన్ని పునరుద్ధరించడానికి వేంగి మీద కూడా దాడి చేశాడు. రాజేంద్ర చోళుడు 1018 లో శ్రీలంక ఆక్రమణను పూర్తి చేసి సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
రాజేంద్రచోళుడు 1019 లో పాలారాజు మహిపాలాను ఓడించి గంగా నది వరకు వెళ్ళాడు. రాజేంద్రచోళుడు 1021 లో పశ్చిమ చాళుక్యులతో పోరాడారు, 1011 లో చోళ ప్రభావాన్ని కొనసాగించడానికి వెంగిపై దాడి చేశారు. చోళ వ్యూహాత్మక ప్రయోజనాలను పొందటానికి చోళనావికాదళం శ్రీవిజయ రాజ్యం మీద దాడి చేసి జయించింది. అయినప్పటికీ శాశ్వత ప్రాదేశిక లాభం లేదు. చోళ ఆధిపత్యాన్ని గుర్తించడం, కప్పం చెల్లించే షరతుతో రాజ్యాన్ని శ్రీవిజయ రాజుకు తిరిగి ఇచ్చారు.
రాజరాజచోళుడి కాలం నుండి చోళులచరిత్ర పశ్చిమ చాళుక్యుల వరుస విభేదాలతో ముడిపడి ఉంది. పాత చాళుక్య రాజవంశం పశ్చిమ, తూర్పు చాళుక్యుల రెండు అనుసంధిత రాజవంశాలుగా విడిపోయాయి. రాజరాజచోళుడి కుమార్తె కుందవై వేంగిని కేంద్రంగా చేసుకుని పాలించిన తూర్పు చాళుక్య యువరాజు విమలాదిత్యను వివాహం చేసుకున్నది. వెంగీరాజ్యం తమ సహజ ప్రభావ పరిధిలో ఉందని పశ్చిమ చాళుక్యులు భావించారు. పశ్చిమ చాళుక్యులతో సంభవించిన యుద్ధాలలో చోళులు అనేక పరాజయాలను చవిచూశారు. సరిహద్దు చాలావరకు రెండు రాజ్యాలకు సరిహద్దు తుంగభద్ర నది వద్ద ఉండిపోయింది. రెండు రాజ్యాల మద్య సంభవించిన యుద్ధాలు చివరికి చోళరాజు రాజాధిరాజ మరణానికి దారితీసింది.
రాజేంద్రచోళుడి పాలన తరువాత అతని ముగ్గురు కుమారులు: మొదటి రాజాధిరాజ చోళుడు, రెండవ రాజేంద్ర చోళుడు, వీరరాజేంద్ర చోళుడు. 1054 లో యుద్ధరంగంలో రాజాధిరాజ చోళుడు మరణించిన తరువాత రెండవ రాజేంద్ర చోళుడు తనకు తాను కిరీటధారణ చేశాడు. తరువాత వీరరాజేంద్ర చోళుడు 1063 లో వారసత్వంగా అధకారం సాధించి 4 వ విక్రమాదిత్యను ఒక కూటమికి ఒప్పించి పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని విభజించగలిగాడు. వీరరాజేంద్ర మరణించినప్పుడు విక్రమాదిత్య చోళ సంతతికి చెందిన తూర్పు చాళుక్య యువరాజు రాజేంద్ర చాళుక్యను వెంగీ సింహాసనాన్ని అధిరోహించకుండా నిరోధించడానికి ప్రయత్నించాడు. కళింగతుపరణి అభిప్రాయం ఆధారంగా రాజు అంటే విరారాజేంద్ర మరణించినప్పుడు అభయ (మొదటి కులోత్తుంగ) తన ఉత్తర పోరాటం నుండి ఇంటికి తిరిగి వచ్చి పరిస్థితిని పునరుద్ధరించే వరకు సామ్రాజ్యంలో గందరగోళం నెలకొంది. ఆ విధంగా తరువాతి చోళుల కాలం ప్రారంభమైంది.[1]
రాజరాజ చోళుడు ఆయన వారసుల ఆధ్వర్యంలోని మధ్యయుగ చోళులు కేంద్ర నియంత్రణ స్వయంప్రతిపత్త గ్రామ సమావేశాలతో అత్యంత వ్యవస్థీకృత పరిపాలనా నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. ప్రభుత్వ వ్యవస్థ వంశపారంపర్య రాచరికం, రాజు పట్టాభిషేకం ఆకట్టుకునే వేడుకగా నిర్వహించబడింది. రాజ గృహంలో అనేక విభాగాలలో అనేకమంది సేవకులు ఉన్నారు. పరిపాలన ప్రయోజనం కోసం సామ్రాజ్యం వలనాడు, మండలం, నాడు వంటి సౌకర్యవంతమైన ప్రాంతాలుగా విభజించబడింది. భూ ఆదాయాలు ప్రభుత్వ ఆధాయానికి ప్రధానమైన వనరుగా ఉండేది. భూ హక్కులు, ఆదాయ బకాయిలను నమోదు చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామ న్యాయస్థానాలకు అదనంగా క్రమం తప్పకుండా ఏర్పాటు చేసిన రాజ న్యాయస్థానాలు న్యాయవ్యవస్థను నిర్వహించాయి. రాజద్రోహం వంటి నేరాలకు రాజు స్వయంగా శిక్షించాడు. చోళపాలన కాలం అత్యంత ఆకర్షణీయమైన లక్షణం స్వయంప్రతిపత్త గ్రామీణ సంస్థల అసాధారణ శక్తి, సామర్థ్యం ప్రదర్శించబడింది.
చోళ పాలన ఈ కాలం తమిళ ఆలయ నిర్మాణ పరిపక్వతను చూసింది. రాజరాజచోళుడు తంజావూరులో గొప్ప బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఆయన కుమారుడు రాజేంద్రచోళుడు తన కొత్త రాజధాని గంగైకొండ చోళపురం వద్ద ఆలయాన్ని నిర్మించడం ద్వారా ఈ ప్రయత్నాన్ని అనుకరించాడు. ఈ యుగంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలలో హిందూ మత పునరుజ్జీవనం కూడా కనిపించింది. ఈ కాలంలో శైవ, విష్ణవ నియమావళిని సేకరించి వర్గీకరించారు.
అంతకు ముందువారు ఆరంభకాల చోళులు |
చోళరాజ వంశం: మద్యయుగ చోళులు |
తరువాత వారు చాళుక్య చోళులు |