మధిర సుబ్బన్న దీక్షితులు (1868–1928) కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఒక గురువు తన శిష్యులతో కాశీ ప్రయాణమై దారిలో ఆగిన ప్రతిచోట ఒక కథ చెప్పేవారట. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు.[1][2]
ఆయన రాసిన కథలు తెలుగు సినిమాలుగా నిర్మితమయ్యాయి.[3]