మధు కోడా | |||
| |||
పదవీ కాలం 16 మే 2009 – 16 మే 2014 | |||
ముందు | లక్ష్మణ్ గిలువా | ||
---|---|---|---|
తరువాత | లక్ష్మణ్ గిలువా | ||
నియోజకవర్గం | సింగ్‌భూమ్ | ||
పదవీ కాలం 14 సెప్టెంబర్ 2006 – 23 ఆగస్టు 2008 | |||
గవర్నరు | సయ్యద్ సిబ్తే రాజీ | ||
డిప్యూటీ | సుధీర్ మహతో | ||
ముందు | అర్జున్ ముండా | ||
తరువాత | శిబు సోరెన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గువా, జార్ఖండ్, భారతదేశం | 1971 జనవరి 6||
రాజకీయ పార్టీ | ఐఎన్‌సీ | ||
జీవిత భాగస్వామి | గీతా కోడా (వివాహం 2004) | ||
సంతానం | 1 కుమార్తె | ||
నివాసం | జగన్నాథ్‌పూర్, జార్ఖండ్ |
మధు కోడా (జననం 6 జనవరి 1971) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 18 సెప్టెంబర్ 2006 నుండి 27 ఆగస్టు 2008 వరకు (యూపీఏ కూటమి) జార్ఖండ్ ఐదవ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
కోడా 1971లో ఒరిస్సాలో బిశ్వనాథ్ దాస్, 2002లో మేఘాలయలో ఫ్లిండర్ ఆండర్సన్ ఖోంగ్లామ్ తరువాత భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన మూడవ స్వతంత్ర శాసనసభ్యుడు.
మధు కోడా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌లో కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2000 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్నాథ్‌పూర్ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 15 నవంబర్ 2000న జార్ఖండ్ రాష్ట్రం బీహార్ దక్షిణ భాగం నుండి విడిపోగా కోడా నియోజకవర్గం జగన్నాథ్‌పూర్ జార్ఖండ్‌లో చేర్చబడింది. ఆయన జార్ఖండ్ శాసనసభ సభ్యుడు అయ్యాడు.
ఈ ప్రభుత్వంలో మధు కోడా రూరల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ (ఇండిచార్జి) రాష్ట్ర మంత్రిగా పని చేశాడు. కానీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీకి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు తిరుగుబాటు చేయగా ఆయన చివరకు రాజీనామా చేశాడు. అర్జున్ ముండా 18 మార్చి 2003న బాధ్యతలు నూతన ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టగా, మధు కోడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
జార్ఖండ్లో 2005లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మధు కోడాకు బిజెపి టిక్కెట్ నిరాకరించడంతో ఆయన జగన్నాథ్‌పూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
2 మార్చి 2005న చాలా రాజకీయ బేరసారాలు, క్విడ్ ప్రోకో తర్వాత కాంగ్రెస్ - జెఎంఎం కూటమికి చెందిన శిబు సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సయ్యద్ సిబ్తే రాజీ జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాడు. ఆ తరువాత తొమ్మిది రోజుల అనంతరం మార్చి 11న అసెంబ్లీలో విశ్వాసం ఓటింగ్‌లో విఫలమవడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి చెందిన అర్జున్ ముండా ముఖ్యమంత్రి అయ్యాడు, వీరికి కోడా మద్దతు తెలపగా మైనింగ్ జియాలజీ, కోఆపరేటివ్ మంత్రిగా నియమించబడ్డాడు.
సెప్టెంబరు 2006లో మధు, మరో ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు ముండా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు, దీనితో ముండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. మధు కోడాకు యూపీఏ మద్దతుతో 14 సెప్టెంబర్ 2006న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు. శిబు సోరెన్ 12 ఆగస్టు 2008న శాసనసభలో అవిశ్వాస తీర్మాన పెట్టడంతో మధు కోడా 23 ఆగష్టు 2008న జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.[1]
2009లో జై భారత్ సమంతా పార్టీని స్థాపించాడు.
కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదయ్యింది. ఈ కేసులో అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా, గుప్తాతో పాటు జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసు, విసును సీబీఐ కోర్టు దోషులుగా ప్రకటించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 2017లో ఆయనకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించింది.[2][3]