మధుమాసం (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చంద్రసిద్దార్థ |
---|---|
నిర్మాణం | డి.రామానాయుడు |
కథ | బలభద్రపాత్రుని రమణి |
తారాగణం | సుమంత్, స్నేహ, కృష్ణుడు (నటుడు), పార్వతి మెల్టన్, సీమ, నరేష్, రావి కొండలరావు, చలపతి రావు, అస్మిత, శివపార్వతి, దీపాంజలి, బేబీ యాని |
సంగీతం | మణిశర్మ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మధుమాసం 2007 లో చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్ ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ చిత్రంలో కథ మూడురకాల మనస్తత్వాల గురించీ పరిస్థితుల ప్రభావం వలన ఆమనస్తత్వాలలో కలిగే మార్పుల గురించీ ఈ చిత్రం చూపిస్తుంది. సంజయ్ (సుమంత్) పక్కా ప్రాక్టికల్ మనిషి. ప్రేమ దోమ లాంటివి లేవని నమ్మే వ్యక్తి. అతని స్నేహితురాలు మాయ (పార్వతీ మెల్టన్) ఇంకొక అడుగు ముందుకు వేసి సిగరెట్లు తాగడం, మందుకొట్టడం, నచ్చిన మగాడితో తిరగడం లాంటివి చేసే విచ్చలవిడి మనస్తత్వం కలిగిన అత్యాధునిక స్త్రీ. వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం గల అమ్మాయి హంస (స్నేహ). తను ఉద్యోగం చేస్తూ తండ్రిని పోషిస్తుంటుంది. ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా, కొన్ని సంఘటనల వలన సంజయ్ ప్రేమను నమ్మే వాడుగా మారి హంసను ప్రేమించడం ప్రారంభిస్తే, అందుకు విరుద్ధంగా హంస ప్రేమ, ఆప్యాయతలు, స్వార్ధమునుండే పుడతాయని ప్రేమాభిమానాలు నమ్మని వ్యక్తిగా మారుతుంది. విచ్చలవిడిగా తిరిగే మనస్తత్వంగల మాయ ఒక పరిణితి చెందిన స్త్రీగా మారుతుంది. తననిష్టపడే యువకున్ని పెళ్ళి చేసుకొంటుంది. సంజయ్ ప్రేమించే హంస, సంజయ్ ప్రేమను సైతం నమ్మనిదిగా మారగా ఆమెలో మార్పు తీసుకొచ్చి పెళ్ళి చేసుకొంటాడు సంజయ్.
చాలా కాలం విరామం తరువాత రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. పాటలు అన్నీ బావున్నా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఏపాటా గుర్తుండదు. సినిమాను కుటుంబసమేతంగా చూసే విధంగా తీసారు. ఎక్కడా అసభ్యత అశ్లీలం కనిపించవు. కమర్షియల్గా పెద్ద విజయం సాధించనప్పటికీ విలువలు కలిగిన సినిమాగా నిలబడింది.