మధుర శ్రీధర్ రెడ్డి | |
---|---|
జననం | |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
మధుర శ్రీధర్ రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు. మధుర ఆడియో కంపెనీ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, 2010లో స్నేహగీతం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
శ్రీధర్ రెడ్డి వరంగల్లో పుట్టి పెరిగాడు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఎన్‌ఐటి వరంగల్) నుండి బిటెక్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నాడు. మద్రాస్ లోని ఐఐటి నుండి ఎంఎస్ (రీసెర్చ్) పూర్తి చేసి, భారత వైస్ ప్రెసిడెంట్ చేత బంగారు పతకాన్ని అందుకున్నాడు.[1] టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి అనేక బహుళజాతి కంపెనీలలో పనిచేశాడు.
స్నేహగీతం,[2] ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన మాయ సినిమా నిర్మాతగా తొలి చిత్రం.
లేడీస్ & జెంటిల్మెన్[3] ఒక మనసు,[4] ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, ఎబిసిడి: అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ, దొరసాని వంటి చిత్రాలను నిర్మించాడు.
స్నేహ గీతం సినిమాకు మధుర శ్రీధర్ రెడ్డి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డు గెలుపొందాడు. 2015 నంది అవార్డులలో లేడీస్ & జెంటిల్మెన్ సినిమా 3వ ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో నంది అవార్డులను గెలుచుకుంది.
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2010 | స్నేహగీతం | దర్శకుడు | ఉత్తమ తొలి దర్శకుడు |
2011 | ఇట్స్ మై లవ్ స్టోరీ | దర్శకుడు | |
2013 | బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ | దర్శకుడు | |
2013 | ప్రేమ ఇష్క్ కాదల్ | సహ నిర్మాత | |
2014 | మాయ | నిర్మాత | |
2015 | లేడీస్ & జెంటిల్మెన్ | నిర్మాత | |
2016 | ఒక మనసు | నిర్మాత | |
2017 | ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ | నిర్మాత | |
2019 | ఎబిసిడి: అమెరికన్ బార్న్ కన్పూజ్డ్ దేశీ | నిర్మాత | |
2019 | దొరసాని | నిర్మాత | |
2021 | లవ్ లైఫ్ అండ్ పకోడి | నిర్మాత |