మధుర్ భండార్కర్ | |
---|---|
జననం | |
వృత్తి | సినీ దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1995 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రేణు భండార్కర్ |
మధుర్ భండార్కర్ (జననం 1968 ఆగస్టు 26) భారతీయ దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత. వాణిజ్యపరంగానూ, విమర్శపరంగానూ విజయవంతమైన అనేక చిత్రాలను నిర్మించారు. ఆయన జాతీయ ఉత్తమ దర్శకుడు, జాతీయ ఉత్తమ చిత్రం వంటి పలు పురస్కారాలు పొందారు.
చాందినీ బార్ (2001) సినిమాకు గాను సామాజిక సమస్యలకు గాను జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని పొందారు. భండార్కర్ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో పేజ్ 3 (2005) సినిమాకి ఉత్తమ చిత్రం, ట్రాఫిక్ సిగ్నల్ (2007) సినిమాకి ఉత్తమ దర్శకుడు పురస్కారాలు పొందారు. ఫ్యాషన్ (2008) ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లేలకు గాను ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి నామినేట్ అయ్యారు.
మధుర్ న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితిలో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానం పొందారు.[1] 2016లో, మధుర్ భండార్కర్ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు.[2]