![]() | |
ప్రభుత్వ స్థానం | భోపాల్ |
---|---|
దేశం | భారతదేశం |
చట్ట వ్యవస్థ | |
అసెంబ్లీ | మధ్య ప్రదేశ్ శాసనసభ |
స్పీకరు | నరేంద్ర సింగ్ తోమార్ (బిజెపి) |
అసెంబ్లీ సభ్యులు | 231 (230 ఎనిక + 1 నామినేటడ్) |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
గవర్నరు | మంగుభాయ్ సి. పటేల్ |
ముఖ్యమంత్రి | మోహన్ యాదవ్ (బిజెపి) |
ప్రధాన కార్యదర్శి | వీర రాణా, IAS |
న్యాయవ్యవస్థ | |
హైకోర్టు | మధ్య ప్రదేశ్ హైకోర్టు |
ప్రధాన న్యాయమూర్తి | జస్టిస్ షీల్ నాగు' (తాత్కాలిక) |
మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, అనేది మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానికంగా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రం, దాని 55 జిల్లాలపై పరిపాలనసాగించే అత్యున్నత పాలక అధికార సంస్థ. ఇది మధ్య ప్రదేశ్ గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసన శాఖను కలిగి ఉంటుంది. 2000లో ఈ రాష్ట్రం నుండి దక్షిణ భాగం, దాని స్వంత ప్రభుత్వంతో కొత్త రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ను ఏర్పాటు చేయడానికి విభజించబడింది.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతిచే నియమించబడిన గవర్నరు మధ్య ప్రదేశ్ రాష్ట్రాధినేతగా ఉన్నాడు. గవర్నరు పదవి చాలా వరకు లాంఛనప్రాయమైనది. ముఖ్యమంత్రికి ప్రభుత్వ అధిపతిగా కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక అధికారాలు చాలా వరకు కలిగి ఉన్నాయి. భోపాల్ మధ్య ప్రదేశ్ రాజధాని, మధ్య ప్రదేశ్ విధానసభ (శాసనసభ) సెక్రటేరియట్ భోపాల్‌లో ఉన్నాయి.
ప్రస్తుత మధ్య ప్రదేశ్ శాసనసభ ఏకసభ్య శాసనసభ. మధ్య ప్రదేశ్ విధానసభలో 230 మంది శాసనసభ సభ్యులు (ఎం.ఎల్.ఎ.) ఒకే స్థాన నియోజకవర్గాల నుండి ఓటర్లుచే నేరుగా ఎన్నికయ్యారు. ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.ఏదేని పరిస్థితులలో శాసనసభను మధ్యలో గవర్నరు రద్దు చేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.[1]
2016 ఫిబ్రవరి 1 న మధ్య ప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆంగ్లాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది. అన్ని అధికారిక ప్రయోజనాల కోసం సమర్థవంతంగా హిందీని ఉపయోగించబడుతుంది. ఆంగ్లం తెలియని ఉద్యోగులను వేధించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.[2] 2017 డిసెంబరు 4న, మధ్య ప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించే బిల్లును ఆమోదించింది.
జబల్‌పూర్‌లో ఉన్న మధ్య ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం రాష్ట్రం మొత్తంపై అధికార పరిధిని కలిగి ఉంది.[3] ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు.[4]