మధ్యాహ్నం హత్య | |
---|---|
దర్శకత్వం | రాం గోపాల్ వర్మ |
స్క్రీన్ ప్లే | రాం గోపాల్ వర్మ |
కథ | అతుల్ |
నిర్మాత | రాం గోపాల్ వర్మ |
తారాగణం | జె. డి. చక్రవర్తి, ఆమని, ప్రియాంక కొటారి, భానుచందర్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | భానోదయ్ |
సంగీతం | శైలేంద్ర, స్వప్నిల్ |
నిర్మాణ సంస్థ | వర్మ కార్పోరేషన్/ప్రతిమ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 3 సెప్టెంబరు 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మధ్యాహ్నం హత్య 2004, సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, ఆమని, ప్రియాంక కొఠారి, నర్సింగ్ యాదవ్, బ్రహ్మాజీ ముఖ్యపాత్రలలో నటించగా, శైలేంద్ర, స్వప్నిల్ సంగీతం అందించారు.[1][2] సినిమా ఉపశీర్షిక "మీ భార్యను చనిపోతే బాగుండని మీకు ఎప్పుడైనా అనిపించిందా" అనివుండడం, ఒక ప్రచార చిత్రం ఉన్న తీరు ఈ సినిమాను వివాదాస్పదం చేశాయి.
మధ్యాహ్నం హత్య సినిమా ఉపశీర్షికగానూ, ప్రచారం కోసం వాడిన "మీకు ఎప్పుడైనా మీ భార్య చనిపోతే బాగుండనిపించిందా" అన్న వాక్యం వివాదాలకు కారణమైంది.[3] మహిళలపై హింసను, ప్రత్యేకించి గృహ హింసను ప్రోత్సహించేలా, సాధారణీకరించేలా ఈ వాక్యం ఉందంటూ మహిళా సంఘాలు ఉద్యమించాయి.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)