మనిషి మోసుకెళ్ళే ట్యాంకు విధ్వంసక క్షిపణి | |
---|---|
![]() 2019 సెప్టెంబరు 11 ని పరీక్షించిన క్షిపణి | |
రకం | ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | భారతదేశం |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | DRDO & వేమ్ టెక్నాలజీస్ |
తయారీదారు | భారత్ డైనమిక్స్ లిమిటెడ్[1] |
విశిష్టతలు | |
బరువు | 14.5 కి.గ్రా. (32 పౌ.)[2] |
పొడవు | 1,300 mమీ. (4 అ. 3 అం.)[2] |
వ్యాసం | 120 mమీ. (4.7 అం.)[2] |
వార్‌హెడ్ | High-explosive anti-tank warhead (HEAT)[1] |
ఆపరేషను పరిధి | 2.5 కి.మీ. |
గైడెన్స్ వ్యవస్థ | Imaging infra-red (IIR) seeker |
మనిషి మోసే ట్యాంకు విధ్వంసక క్షిపణి [3] మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణి (ఎమ్‌పిఎటిజిఎమ్), ఇది భారతీయ మూడవ తరం ఫైర్-అండ్- ఫర్గెట్ ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి. దీన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తోంది. [2] [1] [4] ఈ క్షిపణికి మాతృక నాగ్ క్షిపణి.
ఎమ్‌పిఎటిజిఎమ్ తక్కువ బరువుతో, ఫైర్-అండ్-ఫర్గెట్ ట్యాంకు విధ్వంసక క్షిపణి. [4] దీనికి హై-ఎక్స్ప్లోజివ్ యాంటీ ట్యాంక్ (HEAT) వార్‌హెడ్‌ను అమర్చారు. ఈ క్షిపణి పొడవు 1,300 మి.మీ., వ్యాసం 120 మి.మీ. బరువు 14.5 kg. దాని కమాండ్ లాంచ్ యూనిట్ (CLU) బరువు 14.25 కిలోలు. దీని పరిధి సుమారు 2.5 కి.మీ.. ఎమ్‌పిఎటిజిఎమ్ లో ఇంటెగ్రేటెడ్ ఏవియానిక్స్‌తో కూడుకున్న అధునాతన ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ రాడార్ (IIR) సీకర్ ఉంది. ఈ క్షిపణికి పైనుండి దాడి చేసే (టాప్ ఎటాక్) సామర్ధ్యం ఉంది.
ఇది FGM-148 జావెలిన్, వంటి వ్యవస్థలతో పోటీగా నిలుస్తుంది. స్పైక్ (ATGM) కంటే సాంకేతికంగా మెరుగైనదిగా భావిస్తున్నారు. [5]
DRDO 2005 లో నాగ్ క్షిపణి యొక్క మ్యాన్-పోర్టబుల్ రకంపై పని ప్రారంభించింది. [6] ఎమ్‌పిఎటిజిఎమ్ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం కొనాల్సిన అవసరం లేదని నిర్ణయించిన తరువాత భారత్, 2017 డిసెంబర్ 20 న, DRDO ఇజ్రాయిల్‌కు చెందిన స్పైక్ (ATGM) ను కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. [7] అయితే, 2018 జనవరిలో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి భారతదేశంలో పర్యటించిన సందర్భంగా ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించింది.[8] 2021 నాటికి ఎమ్‌పిఎటిజిఎమ్ ని అందిస్తామని DRDO వాగ్దానం చేయడంతో 2019 జూన్‌లో భారత్ ఒప్పందాన్ని మళ్లీ రద్దు చేసుకుంది. [9] అయితే, ఈ క్షిపణి మోహరింపుకు సిద్ధమయ్యే లోపు అవసరాల కోసం భారత సైన్యం పరిమిత సంఖ్యలో స్పైక్ (ATGM) ను కొనుగోలు చేసింది. [5]
ఎమ్‌పిఎటిజిఎమ్ ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తెలంగాణలోని భానూరులో ఉన్న కర్మాగారంలో తయారు చేస్తుంది. ఈ కర్మాగారాన్ని 2018 సెప్టెంబరు 29 న ప్రారంభించారు. [10]
2018 సెప్టెంబరు 15 న, DRDO ఎమ్‌పిఎటిజిఎమ్ యొక్క మొదటి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆ తరువాత 2018 సెప్టెంబరు 16 న మరోసారి విజయవంతంగా పరీక్షించింది. [3] [11]
2019 మార్చి 13 న రాజస్థాన్ ఎడారిలో ఎమ్‌పిఎటిజిఎమ్ ను విజయవంతంగా పరీక్షించింది. మరుసటి రోజునే మరో విజయవంతమైన పరీక్ష జరిపింది. [12] [13]
2019 సెప్టెంబరు 11 న మళ్లీ ఈ క్షిపణిని పరీక్షించారు. పరీక్షలో మనిషి మోసుకెళ్ళగల త్రిపాద లాంచరును ఉపయోగించారు. ఈ పరీక్షలో క్షిపణి తన లక్ష్యమైన డమ్మీ ట్యాంకును పైనుంచి దాడి పద్ధతిలో ఛేదించింది. [14]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)