మనీషా యాదవ్ | |
---|---|
జననం | బెంగళూరు, భారతదేశం | 1992 జూన్ 11
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
మనీషా యాదవ్ (జననం 1992 జూన్ 11) ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పని చేస్తుంది. 2012 చిత్రం వజక్కు ఎన్ 18/9లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని "ఆర్తి"గా ఆమె ప్రధాన పాత్రకు ప్రసిద్ధి చెందింది.[1] ఇది ఆమెకు తమిళంలో మొదటి సినిమా కాగా, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.[2]
కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన మనీషా యాదవ్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం వజక్కు ఎన్ 18/9 ద్వారా ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.[3] ఆమె 2012లో తూనీగ తూనీగ అనే తెలుగు చిత్రంలో నటించింది. 2013లో, ఆమె సుసీంతిరన్ రూపొందించిన అధలాల్ కాదల్ సీవీర్, కరు పజానియప్పన్ రూపొందించిన జన్నాల్ ఓరమ్‌లలో నటించింది. అధలాల్ కాదల్ సీవీర్ చిత్రం తెలుగులో ప్రేమించాలి (2014)గా వచ్చింది. ఆమె పట్టాయ కెలప్పనుమ్ పాండియా (2014), త్రిష ఇల్లానా నయనతార (2015) చిత్రాలలోనూ నటించింది.[4]
సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
2012 | వజక్కు ఎన్ 18/9 | ఆర్తి | ఉత్తమ తొలి నటిగా విజయ్ అవార్డు - నామినేట్ చేయబడింది. |
2012 | తూనీగ తూనీగ | మైత్రి | తెలుగు సినిమా |
2013 | అధలాల్ కాదల్ సీవీర్ | శ్వేత | |
2013 | జన్నాల్ ఓరం | కల్యాణి | |
2014 | పట్టాయ కేలప్పనుం పాండియా | కన్మణి | |
2015 | త్రిష ఇల్లానా నయనతార | అదితి | |
2016 | చెన్నై 600028 II: రెండవ ఇన్నింగ్స్ | సొప్పనసుందరి | |
2018 | ఓరు కుప్పై కథై | పూంగోడి | |
2020 | శాండిముని | తామరై / రాధిక |