ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
![]() | |
Personal information | |
---|---|
Nickname | Pocket Hercules[1] |
Nationality | భారతీయుడు |
Born | టిప్పెరా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా | 1912 మార్చి 17
Died | 2016 జూన్ 5 కోల్‌కటా, పశ్చిమబెంగాల్, భారతదేశం [2] | (వయసు: 104)
Occupation | బాడీబిల్డర్ |
Height | 1.51 మీ. (4 అ. 11 అం.)[1] |
Spouse | హ్యూతిక ఐచ్ (1924–2002) |
మనోహర్ ఐచ్ (మార్చి 17, 1912 – జూన్ 5, 2016) [2] భారతదేశానికి చెందిన బాడీబిల్డర్. ఆయన బ్రిటిష్ ఇండియాలోని టిప్పెరా జిల్లాలో (ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని కోమిల్లాజిల్లా) లో డమిటి గ్రామంలో జన్మించారు. ఆయన మిస్టర్ యూనివర్స్ పోటీలో గెలుపొందిన రెండవవాడు. భారత స్వాతంత్ర్యానంతరము మిస్టర్ యూనివర్స్ లో గెలుపొందిన మొదటి భారతీయుడు.[3] ఆయన 1952 లో "నాబా" యూనివర్స్ ఛాంపియన్ షిప్ చేసారు. ఆయన 4 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్నప్పటికీ "పాకెట్ హెర్క్యులస్"గా పేరు పొందారు.[4] ఆయన ఛాతీ కొలత 54 అంగుళాలు, నడుము కొలత 23 అంగుళాలుగా ఉండేది. ఆయన "బాహుబలి" అనే మారుపేరు కలిగి యుండేవాడు.
ఆయన బాల్యం నుండి బలానికి సంబంధించిన ఆటలైన రెస్ట్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి ఆటల పట్ల ఆసక్తి కనబరిచేవారు. తన 12 వ యేట బ్లాక్ ఫీవర్ రావదంతో ఆరోగ్యం చెడిపోయింది.[5] ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ ఎక్సర్ సైజులు చేసూ తిరిగి బలాన్ని పొందారు.
1950లో 36 ఏళ్ల వయసులో మనోహర్ తొలిసారి ‘మిస్టర్ హెర్క్యులస్’ పోటీల్లో విజేతగా నిలిచారు. 1951లో ఏకంగా ‘మిస్టర్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొన్నా... రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ లండన్‌లోనే మకాంపెట్టి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాక్టీస్ చేసి ప్రో షాట్ డివిజన్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజులు బస్ కండక్టర్‌గా మారారు. సర్కస్‌ల్లో కూడా పనిచేశారు. చివరకు 1952లో ‘జాతీయ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ యూనివర్స్ చాంపియన్‌షిప్ టైటిల్’ను సాధించి భారత్ తరఫున రెండో ‘మిస్టర్ యూనివర్స్’గా రికార్డులకెక్కారు. దీంతో అతని సైజ్‌ను బట్టి ‘పాకెట్ హెర్క్యులస్’గా నామకరణం చేశారు. తొలిసారి 1951లో మాంటోష్ రాయ్ (భారత్) మిస్టర్ యూనివర్స్ టైటిల్‌ను గెలిచారు. కొమిల్లా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో జన్మించిన మనోహర్... 1942లో రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. ఆ తర్వాత బ్రిటిష్ అధికారి రెబూ మార్టిన్ ప్రోత్సాహం మేరకు బాడీ బిల్డింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని అంచలంచెలుగా ఎదిగారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు మనోహర్ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేశారు. 1991లో డమ్ డమ్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఆయన లక్షా 63 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.[6]
ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[1] ఆయన కుమారులు జిం, ఫిట్‌నెస్ సెంటరును నడుపుతున్నారు.[7]
భారత తొలితరం బాడీబిల్డర్‌గా ఖ్యాతిగాంచిన మనోహర్ ఐచ్ మే 5 2016 కన్నుమూశాడు. 104ఏండ్ల వయసున్న మనోహర్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించాడు.[8]