మన్యంపులి | |
---|---|
దర్శకత్వం | వైశాక్ |
రచన | ఉదయకృష్ణ |
నిర్మాత | సింధూరపువ్వు కృష్ణారెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | షాజీ కుమార్ |
కూర్పు | జాన్ కుట్టి |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | శ్రీ సరస్వతి ఫిలింస్ |
విడుదల తేదీ | 2 డిసెంబరు 2016 |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹25 కోట్లు[1][2] |
బాక్సాఫీసు | est.₹125 crore[3][4] |
మన్యంపులి 2016 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం.
పులియూర్ మన్యం ప్రాంతం. అక్కడ పులులు సంచరిస్తుంటాయి. ఓ పులి భారిన పడి వాటి కారణంగా కుమార్ (మోహన్ లాల్) తండ్రిని కోల్పోతాడు. అతని చిన్నప్పుడే తల్లి కూడా చనిపోతుంది. తన తమ్ముడు మణిని కూడా అతడే పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రిని చంపిన పులిని తన బావ సాయంతో మట్టుబెడతాడు. అప్పటి నుంచి పులిని వేటాడటంలో ఆరితేరుతాడు. అనాథ అయిన అమ్మాయి మైనా (కమలిని ముఖర్జీ)ని పెళ్లాడుతాడు. వాళ్లకి చిన్ని అనే పాప కూడా ఉంటుంది. అనుకోకుండా పాత విరోధం ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కిశోర్)తో కుమార్‌కి గొడవలు మరలా తిరగబెడుతాయి. దాంతో ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి అతనికి ఇబ్బందులు మొదలవుతాయి.
సరిగా అదే సమయంలో మణి స్నేహితులు ఇద్దరు కలిసి కుమార్ కుటుంబాన్ని సిటీకి తీసుకెళ్తారు. అక్కడ డాడీ గిరిజ (జగపతి బాబు) దగ్గర పని ఇప్పిస్తారు. సెకండాఫ్‌లో డాడీ గిరిజ పులియూర్‌లో కుమార్ కోసం తిరుగుతుంటాడు. కుమార్ ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. డాడీ గిరిజకు, కుమార్‌కు అంత వైరం ఎందుకు వచ్చింది? మణి పరిస్థితి ఏంటి? డాడీ గిరిజ అసలు ఎవరు? మధ్యలో జూలీ (నమిత)కి కుమార్‌తో ఉన్న సంబంధం ఏంటి? వంటివన్నీ ఆసక్తికరంగా కథలో సాగుతాయి.