వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మన్‌ప్రీత్ సింగ్ గోనీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రూప్‌నగర్, పంజాబ్ | 4 జనవరి 1984|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.93 మీ. (6 అ. 4 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 173) | 2008 జూన్ 25 - హాంకాంగ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2008 జూన్ 28 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–2019 | పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | డెక్కన్ ఛార్జర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | గుజరాత్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | టొరంటో నేషనల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | కొలంబో కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020-2021 | ఇండియా లెజెండ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2019 23 జాన్ |
మన్‌ప్రీత్ సింగ్ గోనీ, పంజాబ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు. కుడిచేతి మీడియం పేస్ బౌలర్ గా, కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 2019 జూన్ లో విదేశాలలో ఆడే షార్ట్-ఫార్మాట్ లీగ్‌లు మినహా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[1]
మన్‌ప్రీత్ సింగ్ గోనీ 1984, జనవరి 4న పంజాబ్ లోని రూప్‌నగర్ లో జన్మించాడు.
2007–08 సీజన్‌లో రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్ సింగ్ గోనీ, తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంపికయ్యాడు.[2]
2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లలో తనదైన ముద్ర వేస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రముఖ వికెట్లు తీసిన వారిలో ఒకడిగా నిలిచాడు. చివరి ఓవర్లలో కీలకమైన పరుగులు సాధించి బ్యాట్‌తో కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ టోర్నీలో 16 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2011 ఐపిఎల్ సీజన్ కోసం డెక్కన్ ఛార్జర్స్ అతనిని $290,000 మొత్తానికి తీసుకుంది. ఐపీఎల్ సీజన్ 6 కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎంపిక చేసింది. తన మొదటి మ్యాచ్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ తో ఆడే అవకాశాన్ని పొందాడు, అక్కడ అతను 233 స్ట్రైక్ రేట్‌తో 18 బంతుల్లో 42 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
బంగ్లాదేశ్‌లో జరిగిన ట్రై-నేషన్ సిరీస్‌కు భారత క్రికెట్ జట్టులోకి శ్రీశాంత్ సైడ్ స్ట్రెయిన్‌తో ఔట్ అయిన స్థానంలో గోనీని చేర్చారు.[3]
2012 మార్చి 25న టాప్-లెవల్ ట్వంటీ20 మ్యాచ్‌లో మూడు మెయిడెన్ ఓవర్లు వేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌పై పంజాబ్‌కు చెందిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ విజయంలో గోనీ 4–3–5–3తో ముగించాడు.[4][5][6] ఒకే టీ20(3)లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా ఇప్పటికీ ఉమ్మడి రికార్డును కలిగి ఉన్నాడు.
2017-18 రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున ఐదు మ్యాచ్‌లలో 19 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[7] 2017 ఫిబ్రవరిలో 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం గుజరాత్ లయన్స్ జట్టు అతన్ని 60 లక్షలకు కొనుగోలు చేసింది.[8]
2017 జూన్ లో 2019 గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్‌లో టొరంటో నేషనల్స్ ఫ్రాంచైజీ జట్టు తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[9] 2020 అక్టోబరులో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం కొలంబో కింగ్స్ చేత డ్రాఫ్ట్ చేయబడ్డాడు.[10]