మమతా శంకర్ | |
---|---|
মমতা শঙ্কর | |
![]() 2014లో మమతా శంకర్ | |
జననం | కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1955 జనవరి 7
జాతీయత | ఇండియన్ |
వృత్తి |
|
వీటికి ప్రసిద్ధి | నటన, నృత్యం, ఉదయన్ కళాకేంద్రం |
జీవిత భాగస్వామి | చంద్రోదయ్ ఘోష్ |
పిల్లలు | రతుల్ శంకర్, రజిత్ శంకర్ ఘోష్ |
వెబ్‌సైటు | https://www.mamatashankardancecompany.org/ |
మమతా శంకర్ (జననం 1955 జనవరి 7) భారతీయ నటి, నర్తకి. ఆమె బెంగాలీ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది. సత్యజిత్ రే, మృణాల్ సేన్, రితుపర్ణో ఘోష్, బుద్ధదేబ్ దాస్‌గుప్తా, గౌతమ్ ఘోష్.. ఇలా చాలమంది ప్రముఖ దర్శకుల చిత్రాలలో ఆమె నటించింది. నటిగానే కాకుండా, ఆమె నర్తకి, కొరియోగ్రాఫర్ కూడా. ఆమె సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు. ఆమె సోదరుడు ఆనంద శంకర్ ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్ సంగీతకారుడు.
మమతా శంకర్ 1955 జనవరి 7న నర్తకులు ఉదయ్ శంకర్, అమలా శంకర్ దంపతులకు జన్మించింది.[2] ఆమె కలకత్తాలోని ఉదయ్ శంకర్ ఇండియా కల్చర్ సెంటర్‌లో అమల శంకర్ ఆధ్వర్యంలో డ్యాన్స్, కొరియోగ్రఫీలో శిక్షణ పొందింది.[3]
మమతా శంకర్ 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన మృగయాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
ఉదయన్ - మమతా శంకర్ డ్యాన్స్ కంపెనీని 1986లో ఆమె స్థాపించింది. అలాగే 1978లో 'మమతా శంకర్ బ్యాలెట్ ట్రూప్' స్థాపించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. ఈ బృందం 1979లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన చండాలికా ప్రదర్శించింది.[4] దాని తర్వాత హోరిఖేలా, ఆజ్కేర్ ఏకలాబ్య, మిలాప్, షికార్, మదర్ ఎర్త్, అమృతస్యపుత్ర, శబరి వంటివి ఎన్నో ప్రదర్శించారు.[5][6]
మమతా శంకర్‌కు చంద్రోదయ్ ఘోష్ తో వివాహం జరిగింది. ఆమెకు రతుల్ శంకర్, రజిత్ శంకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.