మయూరి క్యాతరీ | |
---|---|
![]() మయూరి క్యాతరీ (2018) | |
జననం | |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | మయూరి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అరుణ్ రాజ్ (2020)[1] |
మయూరి క్యాతరీ (జననం జూలై 11, 1992) కన్నడ సినిమా నటి, మోడల్. అశ్వినీ నక్షత్ర అనే కన్నడ సీరియల్ తో తన నట జీవితాన్ని ప్రారంభించింది.[2] కృష్ణలీల అనే కన్నడ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది. ఇష్టకామ్య, నటరాజ సేవ, రుస్తుమ్ సినిమాలలో నటించింది.
మయూరి 1992, జూలై 11న ప్రకాష్ - గీత దంపతులకు కర్ణాటకలోని హుబ్లీలో జన్మించింది. [3] హుబ్లీ సెయింట్ మైఖేల్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యను చదివి, హుబ్లీలోని ఫాతిమా కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ పూర్తిచేసింది. తరువాత హుబ్లీలోని ఆక్స్‌ఫర్డ్ కళాశాల నుండి కామర్స్‌లో పట్టభద్రురాలైంది.
మయూరి తొలినాళ్ళలో నాలుగేళ్ళపాటు యాంకర్‌గా పనిచేసింది. మొదట కన్నడ సీరియల్ అశ్విని నక్షత్రలో సూపర్ స్టార్ భార్య అశ్విని పాత్రను పోషించింది. 2015లో మయూరి కన్నడ సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మయూరి నటించిన కృష్ణలీల సినిమా విజయవంతంగా 100 రోజులు ప్రదర్శన జరుపుకుంది. నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఇష్టకామ్య సినిమాలో కావ్యశెట్టితోపాటు విజయ్ సూర్య[4] సరసన నటించింది.[4] పునీత్ రాజ్‌కుమార్ సమర్పణలో నటరాజ సర్వీస్ అనే సినిమాలో శరణ్‌తో కలిసి నటించింది.[5]
సంవత్సరం | సినిమా | పాత్ర(లు) | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2015 | కృష్ణ లీల | లీల | ప్రధాన పాత్రలో ఉత్తమ ప్రదర్శన ఐఫా అవార్డుకు నామినేట్ చేయబడింది ఉత్తమ నటిగా కన్నడ ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది |
[6] |
2016 | ఇష్టకామ్య | ఆచారి | [7] | |
నటరాజ సేవ | సహానా | [3] | ||
2017 | కరియా 2 | జానకి | [8] | |
2018 | రాంబో 2 | ఆమెనే | అతిథి పాత్ర | |
జానీ జానీ ఎస్ పాపా | ఏంజెల్ | అతిథి పాత్ర | ||
8ఎంఎం బుల్లెట్ | స్మిత | |||
2019 | రుస్తుం | అమ్ము | ||
నాన్న ప్రకార | విస్మయ | |||
ఆటకుంటూ లేకకిల్లా | మేఘన | |||
2020 | మౌనం | మయూరి | ||
2021 | పొగరు | శివ సోదరి |
సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2015 | అశ్వినీ నక్షత్ర | అశ్విని | కలర్స్ కన్నడ | [2] |
మయూరికి 2020, జూన్ 12న బెంగళూరులోని శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అరుణ్‌తో వివాహం జరిగింది.[9]