మరవంతే | |
---|---|
గ్రామం | |
Coordinates: 13°42′18″N 74°38′31″E / 13.705°N 74.642°E | |
దేశం | భారతదేశం India |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ఉడిపి |
తాలూకా | బైందూర్ |
భాషలు | |
• అధికారిక భాషలు | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 576224 |
మరవంతే భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, ఉడిపి జిల్లా, బైందూర్ తాలూకాలోని గ్రామం.[1]
ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు చేపలు పట్టడం ప్రధాన కార్యకలాపం.[2] చేపల వేటకు స్థానిక పడవలు, చిన్న డీజిల్ ట్రాలర్‌లను ఉపయోగిస్తారు. ఇక్కడ వర్షాకాలంలో సముద్రయానాన్ని అనుమతించరు.ఇక్కడ కొబ్బరి, వరి ప్రధాన పంటలు.
గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం సమీపంలోని కుందాపుర తాలూకా కేంద్రానికి వెళతారు.
ఇది పారిశ్రామిక కేంద్రమైన మంగళూరు నుండి 115 కి.మీ, ఉడిపి నుండి 55 కి.మీ, కుందాపుర నుండి 18 కి.మీ, బైందూర్ నుండి 21 కి.మీ. దూరంలో ఉంది. ఎన్హెచ్ -66 (పూర్వపు NH-17) హైవేకి ఒకవైపు మరవంతే బీచ్, మరొక వైపున వైపున సౌపర్ణికా నది ప్రవహిస్తుంది.[3] ఇది కర్ణాటకలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి.[4] దాదాపు ఇక్కడ అరేబియా సముద్రాన్ని తాకే సౌపర్ణికా నది, యు-టర్న్ తిరిగి, దాదాపు 10 కి.మీ (6.2 మైళ్ళు) తర్వాత సముద్రంలో కలుస్తుంది. ఔట్‌లుక్ ట్రావెలర్ 2005లో మరవంతే బీచ్ కు కర్ణాటకలోని అత్యంత అందమైన బీచ్‌గా రేటింగ్ వచ్చింది. ఈ బీచ్‌కు వర్జిన్ బీచ్ అని కూడా పేరు పెట్టారు.[5][4][6]
సౌపర్ణికా నది, భారతదేశం, కర్ణాటకలోని కుందాపుర తాలూకా గుండా ప్రవహించే నది. సుపర్ణ అని పిలువబడే గరుడ (డేగ) పక్షి నది ఒడ్డున తపస్సు చేయడం ద్వారా మోక్షాన్ని పొందిందని నమ్ముతారు, అందుకే దీనికి సౌపర్ణికా అని పేరు వచ్చింది. నది ప్రవహిస్తున్నప్పుడు 64 రకాల ఔషధ మొక్కలు, వేర్లలోని పదార్థాలను గ్రహిస్తుందని, తద్వారా అందులో స్నానం చేసే వారికి అనారోగ్యాలు నయమవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం.[7]