మరాఠా కందకం అనేది కలకత్తాలోని ఫోర్ట్ విలియం చుట్టూ ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ నిర్మించిన మూడు-మైళ్ల పొడవున్న లోతైన కందకం.[1] చుట్టుపక్కల గ్రామాలు, కోటలను మరాఠా బార్గీ కిరాయి సైనికుల నుండి రక్షించుకోడానికి దీన్ని నిర్మించారు.[2][3][4][5] ఈ కందకం పందొమ్మిదవ శతాబ్దపు కలకత్తా నగర బయటి సరిహద్దుకు గుర్తు.[6][2]
బెంగాల్‌పై మరాఠాల దండయాత్రల సమయంలో, నాగ్‌పూర్‌లోని మరాఠాలు నియమించిన బార్గీలు అనే కిరాయి సైనికులు గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశారు. దీని వలన బెంగాల్‌కు భారీ ఆర్థిక నష్టాలు సంభవించాయి. 1742లో, బెంగాల్లోనిఈస్టిండియా కంపెనీ ప్రెసిడెంటు, కలకత్తా చుట్టూ కందకాన్ని తవ్వించమని నవాబ్ అలీవర్ది ఖాన్‌ను అభ్యర్థించాడు.[7] ఈ అభ్యర్థనను అలీవర్ది ఖాన్ వెంటనే ఆమోదించాడు. 1743 లో భారతీయులు, యూరోపియన్లు కలిసి విలియం ఫోర్ట్‌కు ఉత్తరాన 3-మైళ్ల పొడవైన కందకాన్ని త్రవ్వారు, దీనినే మరాఠా కందకం అని పిలుస్తారు. [1]
అయితే కందకం పూర్తి కాకముందే మరాఠా దండయాత్రల ముప్పు ఆగిపోయింది. దాంతో కందకం నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.[2] తదనంతరం, ఇది 19వ శతాబ్దంలో కలకత్తా వెలుపలి సరిహద్దుగా ఉండిపోయింది.[6] ఆ తరువాత, నగర రక్షణకు ఏమీ పనికిరాకుండా పోయింది. ఆ కందకం కారణంగా దళాలు, ఫిరంగిదళాల కదలికలకు బాగా ఇబ్బందులు కలిగేవి.[7]
1799లో కలకత్తా చుట్టూ వృత్తాకార రహదారి కోసం కందకాన్ని పాక్షికంగా నింపారు. హారిసన్ రోడ్డు నిర్మాణం కోసం 1893 లో పూర్తిగా పూడ్చేసారు.[2] నేడు, ఉత్తర కోల్‌కతాలో మరాఠా డిచ్ లేన్ పేరుతో ఉన్న రహదారి ఒకప్పుడు కందకం ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది.[3]
↑Acworth, Harry Arbuthnot (1894). Ballads of Marathas (in ఇంగ్లీష్). Longmans, Green, and Company. Archived from the original on 8 April 2023. Retrieved 19 March 2023.