మర్పల్లి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′26″N 77°46′19″E / 17.540606°N 77.771988°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | మర్పల్లి కలాన్ |
గ్రామాలు | 28 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 51,090 |
- పురుషులు | 25,714 |
- స్త్రీలు | 25,376 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 45.86% |
- పురుషులు | 57.58% |
- స్త్రీలు | 33.51% |
పిన్‌కోడ్ | 501202 |
మర్పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మర్పల్లి, ఈ మండలానికి కేంద్రం.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 51,090. జనాభాలో పురుషులు 25,714 కాగా, స్త్రీల సంఖ్య 25,376. మండలంలో 10,961 గృహాలున్నాయి.[3]
ఈ మండలానికి సమీపంలో సదాశివపేట, మునిపల్లి మండలం ఉత్తరాన, మోమిన్‌పేట మండలం తూర్పువైపున, కోహీర్ మండలం పడమరన, కోట్‌పల్లి, బంట్వారం మండలాలు దక్షిణాన ఉన్నాయి.
ఈ గ్రామానికి దగ్గరలోని పట్టణం సదాశివపేట 28 కి.మీ. దూరములో ఉంది. రోడ్డు వసతి వుండి బస్సు సౌకర్యముంది. ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషను మర్పల్లి రైల్వే స్టేషను. హైదరాబాద్ రైల్వే స్టేషను ఇక్కడికి 91 కి.మీ. దూరములో ఉంది.