మలక్‌పేట | |
---|---|
పాతబస్తీ | |
Coordinates: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 036 |
Vehicle registration | టిఎస్-11 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
మలక్‌పేట్ (Malakpet) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా సేవకుడైన మాలిక్ యాకుబ్ పేరుమీదుగా ఈ ప్రాంతానికి మలక్‌పేట అని పేరు వచ్చింది. ఇది పాత మలక్‌పేట, కొత్త మలక్‌పేట అని రెండు భాగాలుగా ఉంది.
మలక్‌పేట ఉత్తర దిక్కులో అంబర్‌పేట, ముసరాంబాగ్, తూర్పు దిక్కులో దిల్‌సుఖ్‌నగర్, పడమర దిక్కులో చాదర్‌ఘాట్, దక్షిణ దిక్కులో సైదాబాద్ ఉన్నాయి.
చారిత్రాత్మకమైన రేమండ్స్ స్తూపం ఇక్కడ ఒక కొండపైన నిర్మించబడింది. 1902వ సంవత్సరంలో మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మహబూబ్ మాన్షన్ అనే రాజభవనం నిర్మించబడింది.[1]
ఈ నామ్ మార్కెటింగ్‌లో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ దేశ మార్కెట్లకే ఆదర్శంగా నిలిచింది.[2]
మలక్‌పేటలో సౌకర్యవంతమైన అనేక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి.
ఇక్కడ తాళజాతి మొక్కల వనము ఉంది. దీనిని 2002 సంవత్సరంలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మలక్‌పేటకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ మలక్‌పేట రైల్వే స్టేషను, మలక్‌పేట మెట్రో స్టేషను కూడా ఉన్నాయి.
మలక్‌పేట నియోజకవర్గం అక్బర్‌బాగ్ డివిజన్ పరిధి బి- బ్లాక్‌లోని ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంలో రూ.1,032 కోట్ల వ్యయంతో పది ఎకరాల విస్తీర్ణంలో 21 అంతస్తులతో 20లక్షల చదరపు అడుగుల్లో భారీస్థాయిలో నిర్మించనున్న ఐటీ టవర్‌కు 2023, అక్టోబరు 2న రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[3] ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ అత్యాధునిక ఐటీ టవర్‌తో హైదరాబాద్‌లో దాదాపు 50,000 ఐటీ ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.[4]