మల్లాపూర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°27′N 78°34′E / 17.45°N 78.57°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500076 |
Vehicle registration | టిఎస్ |
మల్లాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలో వార్డు నంబరు 5గా ఉంది.[1]
నాచారం,చర్లపల్లి , హబ్సిగూడ, గాయత్రీ హిల్స్, చిలుకనగర్, హేమ నగర్ కాలనీ, సాయి రెసిడెన్సీ, న్యూ హేమ నగర్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]
ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి.[2]
ఇక్కడ ఉష్ణమండల సవన్నా వాతావరణం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో 1966, జూన్ 2న 45.5oC (113.9 °F) నమోదు కాగా, నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో 1946, జనవరి 8న 6.1oC (43 °F) గా నమోదయింది.[3]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మల్లాపూర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. చిలుకనగర్, నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, నాచారం, హేమనగర్ ప్రాంతాలలో బస్టాపులు ఉన్నాయి. సమీపంలోని మౌలాలీ రైల్వే స్టేషను, చర్లపల్లి రైల్వే స్టేషను ఉన్నాయి.[2] మల్లాపూర్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా బస్సులు ఉన్నాయి .
మల్లాపూర్‌లో నూతనంగా రూ. 4 కోట్లలో నిర్మించిన వైకుంఠధామాన్ని 2022 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5][6] మల్లాపూర్ ప్రాంతం లో నూతనంగా గవర్నమెంట్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి .
అందులో బాగంగా గవర్నమెంట్ నుంచి సరిపడు నిధులు విడుదల కన్నందునా నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలుపవేయబడింది .
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)