మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ | |
---|---|
![]() మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ | |
రకం | టవర్ |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ |
విస్తీర్ణం | చార్మినార్ |
నిర్మించినది | 1892 |
మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ కు పడమర వైపున్న క్లాక్ టవర్. 1880లో పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఈ ఐదు అంతస్తుల క్లాక్ టవర్ ను నిర్మించాడు. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో 1892లో హైదరాబాద్ వాస్తుశిల్పి వారసత్వం యొక్క ముఖ్యమైన భాగంగా పరిగణించబడిన మహబూబ్ చౌక్ ప్రాంతంలోని చిన్న తోట మధ్యలో ఐదు అంతస్తుల్లో ఈ క్లాక్ టవర్ నిర్మించబడింది.[1][2]
టర్కీష్ శైలిలో నిర్మించబడిన క్లాక్ టవర్ నాలుగు వైపుల నాలుగు పెద్ద గడియారాలు ఉన్నాయి, నాలుగు దిశల నుండి సమయాన్ని చూడవచ్చు.
చార్మినార్ కు పడమర వైపున, లాడ్ బజార్ కు సమీపంలో ఈ మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ ఉంది.[3][4][5][6]