మహాకవి కాళిదాసు చిత్రం 1960 ఏప్రిల్ 2 న విడుదల.పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో, పింగళి నాగేంద్రరావు కథ, అందించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతంలో విడుదలైన ఈ చిత్రాన్ని కె.నాగమణి, పి సూరిబాబు నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీరంజని,రాజసులోచన , ఎస్.వి.రంగారావు, రేలంగి,మొదలగు వారు నటించారు.
మహాకవి కాళిదాసు (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | కె.నాగమణి, పి.సూరిబాబు |
కథ | పింగళి నాగేంద్రరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, రేలంగి, శ్రీరంజని, రాజసులోచన, సి.యస్.ఆర్, లింగమూర్తి, సూరిబాబు, కె.వి.యస్.శర్మ వంగర, సీతారాం, బొడ్డపాటి, మోహన్‌దాస్, రామకోటి, కాళిదాసు కోటేశ్వరరావు, భీమారావు, నాగలింగం, వేళంగి, సి.హెచ్.ప్రభావతి, టి.రాజేశ్వరి, చిట్టి శ్వామల, కాకినాడ రాజారత్నం, సంధ్య, వాసంతి, కుచలకుమారి, విజయలక్ష్మి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి.జి.కృష్ణవేణి, పి.సుశీల, పి.లీల, రాణి, జయలక్ష్మి |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి సత్యం |
గీతరచన | పింగళి నాగేంద్రరావు |
ఛాయాగ్రహణం | అన్నయ్య |
కళ | మాధవపెద్ది గోఖలే |
కూర్పు | ఆర్.వి.రాజన్ |
నిర్మాణ సంస్థ | సారణి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
"మహాకవి కాళిదాసు" సినిమా సంస్కృత కవి కాళిదాసు గారి జీవిత కథ ఆధారంగా 1960 లో తీయబడింది. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వర రావు గారు దర్శకత్వం వహించారు. కాళిదాసు పాత్రను అక్కినేని నాగేశ్వర రావు గారు పోషించారు.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
జయ జయ జయ శారదా జయ కళాభి శారదా నవ విధ వీణా సారథివై అవతరించినావుగా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
నీ కెట్టుందో గాని పిల్లా నాకు భలేగా వుందిలే | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
మాణిక్యవీణా ముపలాలయంతీ మదాలసాం మంజుల వాగ్విలాసాం | కాళిదాసు | ఘంటసాల | ఘంటసాల |
నన్ను చూడు నా కవనం చూడు | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది సత్యం |
రసిక రాజ మణి రాజిత సభలో | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి లీల, ఆర్ జయలక్ష్మి |
అవునులే అవునవునులే | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి సుశీల |
నాలో నాయనా నన్నాడమంటే , ఘంటసాల , బృందం, రచన: పింగళి నాగేంద్ర రావు
చాంగు భళ వెలుగు వెలగర నాయనా , ఘంటసాల , రచన: పింగళి నాగేంద్రరావు.
సుధా సముద్రంత రుద్యన్మని దీప(దండకం), ఘంటసాల , రచన: కాళిదాసు.
వాగ్దాలనిన సంపృక్తవ్ (శ్లోకం) ఘంటసాల , రచన: కాళిదాసు
ద్రౌపద్యాహ పాండు తనయా(శ్లోకం), ఘంటసాల, రచన: కాళిదాసు.
శకుంతల (నాటకం) ఘంటసాల , లీల , హరిబాబు , బృందం , రచన: కాళిదాసు.
అసనేపుత్ర పిడాచ బందు పిడాచ (పద్యం),మాధవపెద్ది , రచన: పింగళి నాగేంద్రరావు
ఆ మాటంటే ఎందుకు కోపం రమణులకు,మాధవపెద్ది , జిక్కి
ఎందుకు వేసిన వేషమయా ఓ చందమామా , పి.సుశీల
చెంతకు రాకురా పంతమేల పోరా, పసుమర్తి కృష్ణమూర్తి, రాధాజయలక్ష్మి
ప్రణయ కారిణి వౌచు పరిణామ కారినివై,(శ్లోకం), పి.లీల , కాళిదాస కృతం
రామ పదాబ్ద భక్తుడవు రామచరిత్ర శిలాక్షరముగా (పద్యం), పి.సూరిబాబు , కాళిదాస కృతo.
రాజనీతిని లోకరక్షగా చూపించ రఘువంశ ,(పద్యం), పి సూరిబాబు , రచన: కాళిదాసు కృతం
వాగర్బ ప్రతిపత్తయే జగత : పితరౌ వందే పార్వతీ(శ్లోకం), ఘంటసాల, రచన: కాళిదాసు కృతం
శ్రీకరమగు పరిపాలన నీవే జగదేశ్వరి , పి.లీల బృందం
శ్రీరాముడే ప్రాణులకాత్మా రాముండగుచు (పద్యం),మాధవపెద్ది , రచన:పింగళి నాగేంద్రరావు
శ్రీల విలసిల్లు కళలతో చెలువుమీరి జ్ఞానపీఠనీ(పద్యం), పి.లీల , రచన: పింగళి నాగేంద్రరావు
ఈ విపరీత వియోగముతో జీవితమంతా గడిచేనా చేసిన , పి.లీల
నిన్ను గనినంతనే తెలిసే నీ ఘనశీల గుణాభిజాత్యముల్ (పద్యం), పి.సూరిబాబు