మహారాజా కళాశాల | |
Logo | |
నినాదం | Righteousness in the heart and beauty in the character |
---|---|
రకం | Autonomous institution |
స్థాపితం | 1879 |
ప్రధానాధ్యాపకుడు | Dr. M.D.Prasad Patnaik |
Chairman | శ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజు |
అండర్ గ్రాడ్యుయేట్లు | 2,192 per year |
చిరునామ | విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | Urban |
జాలగూడు | [1] |
మహారాజా కళాశాల, (ఎం.ఆర్.కళాశాల, మహారాజా కాలేజి) ఆంధ్రప్రదేశ్, విజయనగరం లో వుంది. ఇది భారతదేశంలోనే అతి పురాతనమైన కళాశాల.[1] ఇది 1879లో అప్పటి విజయనగరం మహారాజు పూసపాటి విజయరామ గజపతి చే స్థాపించబడినది. "నేషనల్ అక్రెడిటేషన్, అసెస్‌మెంట్ కౌన్సిలు" ఈ కళాశాలను "బి" గ్రేడుగా గుర్తించింది.[2] ఈ కళాశాలలో 21 విభాగములు కలవు. ఈ కళాశాలలో 19 వివిధకరములైన గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నవి. ఈ కళాశాలలో 150 మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలరు. 2009 సంవత్సరానికి 2,192 విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
ఈ కళాశాల విజయనగరం మహారాజు పూసపాటి విజయరామ గజపతి రాజు చే స్థాపించబడింది. ఇది మాధ్యమిక పఠశాలగా 1857లో ప్రారంభించబడి 1968 నాటికి ఉన్నత పాఠశాలగా మారినది. అది 1879లో కళాశాల స్థాయికి ఎదిగినది. గ్రాడ్యుయేషన్ తరగతులు 1881 నుండి పూసపాటి ఆనంద గజపతి రాజు పోషణలో ప్రారంభించబడినవి. 1948లో రాజ సాహెబ్ పి.వి.జి.రాజు తన రాజ భవనాన్ని కళాశాలకు దానం చేసాడు. 1958 లో "మహారాజా అలక్ నారాయన్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్" (మనస్) అనేది ఉనికిలోకి వచ్చింది. 1995 నవంబరు 13న పి.వి.జి.రాజు మరణించాడు. అతని కుమారుడు పూసపాటి ఆనంద గజపతి రాజు చైర్మన్ గా, పూసపాటి అశోక్ గజపతి రాజు వైస్- చైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు. 1987లో ఈ కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది. ఈ సంస్థ తొలి ప్రధానాచార్యుడిగా సి. చంద్రశేఖర శాస్త్రి పనిచేశాడు. తర్వాతి కాలంలో పనిచేసిన వారిలో కె. రామానుజాచారి, ఎ. ఎల్. నారాయణ, వసంతరావు వెంకటరావు వున్నారు.
మహారాజా కళాశాల 18 ఎకరాల విస్తీర్ణంతో, 115,307 sq ft (10,712.4 మీ2) వైశాల్యంలో ఆరు భవనాలతో ఉంది. అందులో 51 తరగతి గదులున్నాయి. 21 ప్రయోగశాలలు, 10 బోధనా సిబ్బంది గదులు ఉన్నాయి. ఒక ప్రధాన గ్రంథాలయంతో పాటు 14 ఇతర విభాగాల గ్రంధాలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన గ్రంథాలయంలో 50,000 పుస్తకాలు, 20 కంప్యూటర్లు (ఇంటర్నెట్ సదుపాయంతో) ఉన్నాయి. రెండు సెమినార్ గదులు, ఒక వైద్య కేంద్రం ఉన్నాయి. బాలుర వసతి గృహం కళాశాల పరిధిలో ఉంది. విశాలమైన ఆటస్థలం ఉంది. అక్కడ వాలీబాల్, బాస్కెట్ బాల్, కబాడ్డీ, ఖో-ఖో, బాల్ బాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, ఫుట్ బాల్, హాకీ వంటి ఆటలు ఆడటానికి సదుపాయాలు ఉన్నవి. ఇండోర్ గేమ్స్, జిమ్నాసియం సదుపాయాలున్నాయి. కళాశాల సిబ్బంది, విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ఆంధ్రా బ్యాంకు శాఖ కూడా ఉంది.
వివిధ విషయాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏటా సుమారు 117 స్కాలర్‌షిప్‌లు, బహుమతులు, పతకాలు ఇవ్వబడతాయి.
మహారాజా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (MRCOSA) 1976లో మహారాజ ఆనంద గజపతి సపద శతజయంతి(125 సంవత్సరాల పూర్తైన సందర్భంగా పండుగ) నిర్వహించింది.
ఈ కళాశాల పూర్వవిద్యార్థులను అక్షరక్రమంలో ఏర్పాటుచేయబడ్డాయి:
{{cite web}}
: Missing or empty |title=
(help)