మహారాణిపేట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°42′36″N 83°18′11″E / 17.709920°N 83.303109°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | మేయర్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530002 |
శాసనసభ నియోజకవర్గం | దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం |
లోక్‌సభ నియోజకవర్గం | విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం |
మహారాణిపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతం.[1] విశాఖపట్నం జిల్లాలోని మహారాణిపేట, విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం మహారాణిపేటలో ఉంది. దీనికి చుట్టుపక్కల సీతమ్మధార, గోపాలపట్నం ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జ్ హాస్పిటల్, అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి.[2]
ఇది 17°42′36″N 83°18′11″E / 17.709920°N 83.303109°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ఇక్కడికి సమీపంలో నెహ్రూ నగర్ కాలనీ, పాండురంగపురం, సిరిపురం, జగదాంబ జంక్షన్, హెచ్‌పిసిఎల్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
మహారాణిపేట మండలంలోని వార్డులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మహారాణిపేట మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, వుడా పార్క్, కపులతుంగ్లం, సింహాచలం బస్ స్టేషన్, పెందుర్తి, కొత్తవలస మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]