మహావీర్ ప్రసాద్ | |||
![]()
| |||
నియోజకవర్గం | బన్స్‌గావ్ | ||
---|---|---|---|
పదవీ కాలం 23 ఏప్రిల్ 1996 - 25 జూలై 1997 | |||
ముందు | షీలా కౌల్ | ||
తరువాత | వి. ఎస్. రమాదేవి | ||
పదవీ కాలం 18 సెప్టెంబర్ 1995 - 16 నవంబర్ 1995 | |||
ముందు | సుధాకరరావు నాయక్ | ||
తరువాత | షీలా కౌల్ | ||
పదవీ కాలం 1994 - 1999 | |||
ముందు | ధనిక్ లాల్ మండల్ | ||
తరువాత | బాబు పరమానంద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1939 నవంబరు 11||
మరణం | 29 నవంబరు 2010 రాజేందర్ నగర్, ఢిల్లీ, భారతదేశం | (aged 71)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఉదాసి దేవి | ||
బంధువులు | 2 తమ్ముళ్లు
లెఫ్టినెంట్ ప్రభునాథ్ ప్రసాద్ లెఫ్టినెంట్ ఛవిలాల్ ప్రసాద్. | ||
సంతానం | విమ్లా దేవి, నిర్మలా దేవి | ||
నివాసం | గోరఖ్‌పూర్ | ||
మూలం | [1] |
మహావీర్ ప్రసాద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1980, 1984, 1989, 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పని చేసి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, హర్యానా గవర్నర్‌గా పని చేశాడు.
మహాబీర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1974 నుండి 1977 వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా పని చేసి 1980లో 7వ లోక్‌సభకు, 1984లో 8వ లోక్‌సభకు ఎన్నికై ఫిబ్రవరి 1988 నుండి జూలై 1989 వరకు రైల్వే శాఖకు కేంద్ర డిప్యూటీ మంత్రిగా, జూలై 1989 నుండి డిసెంబర్ 1989 వరకు కేంద్ర గనులు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 1989లో 9వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
మహాబీర్ ప్రసాద్ 14 జూన్ 1994 నుండి 1999 వరకు హర్యానా గవర్నర్‌గా పనిచేశాడు . అతను హర్యానా గవర్నర్‌గా ఉన్నప్పుడు, 18 సెప్టెంబర్ 1995 నుండి 16 నవంబర్ 1995 వరకు & 23 ఏప్రిల్ 1996 నుండి 26 జూలై 1997 వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత 2004లో 14వ లోక్‌సభకు ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 22 మే 2004 నుండి 22 మే 2009 వరకు కేంద్ర చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ శాఖ & గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.
మహావీర్ ప్రసాద్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2010 నవంబర్ 28న మరణించాడు.[1]