మహాసుందరీ దేవి | |
---|---|
జననం | మధుబని | 1922 ఏప్రిల్ 15
మరణం | 2013 జూలై 4[1] రంతి | (వయసు 91)
జాతీయత | భారతీయురాలు |
రంగం | మిథిలా పెయింటింగ్ |
అవార్డులు | పద్మశ్రీ పురస్కారం (2011) |
మహాసుందరి దేవి (1922 ఏప్రిల్ 15 - 2013 జూలై 4) భారతీయ కళాకారిణి. ఆమె మధుబని చిత్రకారిణి.[2]
పెయింటింగ్ కళకు లివింగ్ లెజెండ్ గా పేరుతెచ్చుకున్న ఆమె 1995లో మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే తులసి సమ్మాన్(Tulsi Samman)ను అందుకుంది. అలాగే ఆమె 1982లో భారత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చేతులమీదుగా జాతీయ అవార్డును అందుకుంది. ఇలా మరెన్నో పురస్కారాలు అందుకున్న ఆమెను 2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.[3][4]
కేవలం అక్షరాస్యురాలు అయిన మహాసుందరీ దేవి ఆమె అత్త నుండి మధుబని కళారూపాన్ని చిత్రించడం నేర్చుకుంది.[5] 1961లో ఆ సమయంలో ప్రబలంగా ఉన్న పర్దా (ముసుగు) వ్యవస్థను విడిచిపెట్టి, కళాకారిణిగా తన స్వంత స్థానాన్ని సృష్టించుకుంది.[6] ఆమె మిథిలా హస్తశిల్ప్ కళాకర్ ఆడియోకి సహయోగ్ సమితి అనే సహకార సంఘాన్ని స్థాపించింది. ఇది హస్తకళలు, కళాకారుల అభివృద్ధికి తోడ్పడింది. మిథిలా పెయింటింగ్‌తో పాటు, ఆమె మట్టి, పేపర్ మాచే, సుజని, సిక్కిలో నైపుణ్యానికి ప్రసిద్ది చెందింది. ఆమె తన చివరి పెయింటింగ్‌ను 2011లో వేసింది. ఆమె 92 యేళ్ల వయసులో 2013 జూలై 4న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. ఆ మరుసటి రోజు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.[7]
ఆమె బీహార్‌లోని మధుబని సమీపంలో ఉన్న రంతి గ్రామ నివాసి.[6] ఆమె కోడలు బిభా దాస్, మరదలు కర్పూరి దేవి కూడా మధుబని పెయింటింగ్ కళాకారులె.[8][9]ఆమె 18 సంవత్సరాల వయస్సులో పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణ కుమార్ దాస్‌ను వివాహం చేసుకుంది.[10] వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.[8]