మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ | |
---|---|
దేశాలు | ![]() |
నిర్వాహకుడు | బిసిసిఐ |
ఫార్మాట్ | ట్వంటీ20 క్రికెట్ |
తొలి టోర్నమెంటు | 2008–09 |
చివరి టోర్నమెంటు | 2022–23 |
తరువాతి టోర్నమెంటు | 2023–24 |
టోర్నమెంటు ఫార్మాట్ | రౌండ్-రాబిన్, నాకౌట్ |
జట్ల సంఖ్య | 37 |
ప్రస్తుత ఛాంపియన్ | రైల్వేస్ (11వ టైటిల్) |
అత్యంత విజయవంతమైన వారు | రైల్వేస్ (11 టైటిల్స్ |
మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ, దీనిని గతంలో సీనియర్ ఉమెన్స్ టీ20 లీగ్ అని పిలిచేవారు.ఇది భారతదేశంలో జరిగే మహిళల ట్వంటీ20 క్రికెట్ పోటీ. ఇది 2008-09 సీజన్‌లో ప్రారంభమైంది.రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లకు 28 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే ఇటీవలి సీజన్ 2022-23లో 37 జట్లు పోటీ పడ్డాయి. పోటీ చరిత్రలో రైల్వేస్ అత్యంత విజయవంతమైన జట్టు,ఇది 11 టైటిళ్లను గెలుచుకుంది. ఢిల్లీ, పంజాబ్ రెండూ ఒక్కోసారి పోటీని గెలుచుకున్నాయి.
టోర్నమెంట్ 2008-09 కాలంలో ప్రారంభమైంది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ,ఆ సమయం ముగిసిన తరువాత అంతర్ రాష్ట్ర మహిళల పోటీ, మహిళల సీనియర్ వన్డే ట్రోఫీతో పోటీపడింది.మొదటి టోర్నమెంట్ ఫలితాలు నమోదు కాలేదు.[1]
2009–10 పోటీలో మహారాష్ట్రను అంతిమంలో 5 వికెట్ల తేడాతో ఓడించి, పోటీలో రైల్వేస్ మొదటి విజేతగా రికార్డు సృష్టించింది.[2][3] రైల్వేస్ తదుపరి ఏడు ఆటలను గెలుచుకుని పోటీలోఆధిపత్యం చెలాయించింది.[4][5][6][7][8][9][10]
2017–18 సీజన్‌లో రైల్వేస్ విజయాల పరంపరను ముగించిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. ఎలైట్ గ్రూప్ సూపర్ లీగ్‌లో మహారాష్ట్ర, బరోడాపై నెట్ రన్ రేట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.[11] తరువాతి 2018–19 సమయంలో ఫైనల్‌లో కర్ణాటకను 4 పరుగుల తేడాతో ఓడించి పంజాబ్ తమ మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుంది.[12][13] 2019-20 కాలానికి ముందు, పోటీలో మహిళల సీనియర్ టీ20 ట్రోఫీగా పేరు మార్చారు. అంతిమంలో బెంగాల్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి రైల్వేస్ తమ టైటిల్‌ను తిరిగి పొందింది.[14][15] కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020–21లో జరగాల్సిన పోటీ రద్దు చేయబడింది.కేవలం 2020–21 మహిళల సీనియర్ ఒక రోజు ఆట పోటీ మాత్రమే జరగింది.[16] 2021–22లో పోటీ పునఃప్రారంభమైంది. రైల్వేస్ వారి పదవ ఆటను గెలుచుకుంది.[17][18] 2022–23లో రైల్వేస్ మళ్లీ టోర్నమెంట్‌ను గెలుచుకుంది.[19]
సీనియర్ మహిళల టీ20 లీగ్ సంవత్సరాలుగా వివిధ ఆకృతులను ఉపయోగించింది. మొదటి సమయం 2008-09 లో, సెంట్రల్, ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ అనే ఐదు ప్రాంతాల 28 జట్లు రౌండ్-రాబిన్ జట్లుతో పోటీ పడ్డాయి. ప్రతి జట్టు నుండి మొదటి రెండు స్థానాలు నాకౌట్ దశకు చేరుకున్నాయి.[1]
2009-10 తదుపరి సీజన్ కోసం ఆకృతి మార్చబడింది.మణిపూర్ సిక్కిం నిష్క్రమణతో 26 జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. మునుపటి ప్రారంభం సమయంలో అదే ప్రాంతీయ జట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మొదటి రెండు జట్లు ఐదు జట్లతో కూడిన రెండు "సూపర్ లీగ్‌లు" దశకు చేరుకున్నాయి. ఈ పోటీల విజేతలు ఆట అంతిమదశకు చేరుకున్నారు.[2] ఈ ఆకృతి 2012-13 ఆటల సమయం ముగిసేవరకు అలాగే ఉంది.[4][5][6]
2013–14 సీజన్ కోసం, 26 జట్లను ఎలైట్ జట్టు, ప్లేట్ జట్లుగా ఏర్పాటు చేశారు. ఆపై ఎలైట్ జట్లు 'ఎ', 'బి' ప్లేట్ జట్లు 'ఎ','బి ', 'సి' లుగా విభజించారు. ప్రతి ప్లేట్ సమూహంలోని మొదటి రెండు నాకౌట్‌లోకి వెళ్లాయి. ఇద్దరు ఫైనలిస్టులు ప్లేట్ గ్రూప్ టైటిల్ కోసం రౌండులో ఆడారు. అదే సమయంలో ఇద్దరూ తదుపరి సీజన్‌లో ఎలైట్ గ్రూప్‌కు ప్రమోషన్‌ను పొందారు. ఇంతలో ప్రతి ఎలైట్ గ్రూప్ నుండి మొదటి ఇద్దరు నాలుగు జట్ల సూపర్ లీగ్‌లోకి వెళ్లారు. విజేతగా టోర్నమెంట్స్ చాంపియన్స్‌గా నిలిచారు.[7] 2016–17 సీజన్‌కు ముందు ఛత్తీస్‌గఢ్‌ను చేర్చడం కోసం సర్దుబాటు చేయడంతో, 2017–18 చివరి వరకు ఇదే ఆకృతి కొనసాగింది.[8][9][10][11]
2018-19 కాలానికి ముందు, పోటీకి తొమ్మిది జట్లు జోడించబడ్డాయి.కొత్తగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పాండిచ్చేరి, ఉత్తరఖండ్, అలాగే తిరిగి వచ్చిన మణిపూర్, సిక్కిం జట్లు చేరాయి. ఈ 36 జట్లను ఐదు సమూహాలుగా విభజించారు. ప్రతి సమూహం నుండి మొదటి రెండు స్థానాలు ఐదు జట్లతో కూడిన రెండుసూపర్ లీగ్ దశలకు చేరుకున్నాయి. ప్రతి సూపర్ లీగ్ విజేత ఫైనల్‌కు చేరుకుంది.[12] చండీగఢ్‌తో పాటు సెమీ-ఫైనల్స్‌తో పాటు (ప్రతి సూపర్ లీగ్‌లో మొదటి ఇద్దరు ఇప్పుడు నాకౌట్ రౌండ్‌లకు అర్హత సాధించడంతో) ఆ ఆకృతిని 2020–21 మహిళల సీనియర్ వన్ ట్రోఫీ సమయంలో విస్తృతంగా కొనసాగించారు.[14] 2021–22లో, జట్లను ఇప్పుడు ఐదు ఎలైట్ జట్లు, ఒక ప్లేట్ జట్టుగా విభజించారు,
ప్రతి ఎలైట్ జట్టు నుండి మొదటి ఇద్దరు, ప్లేట్ జట్టు నుండి ఒకరు అగ్రస్థానానికి చేరుకోవడంతో నాకౌట్ దశలకు వచ్చాయి [18] 2022–23లో ఆట ఆకృతి మళ్లీ మారింది. అన్ని జట్లను ఐదు సమూహాలుగా విభజించారు. పదకొండు జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి.[18] ట్వంటీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడారు. టోర్నమెంట్ ఇటీవలి ఎడిషన్‌లో, జట్లకు గెలుపు కోసం 4 పాయింట్లు, టైకి 2 పాయింట్లు, ఫలితం లేక పోవడం లేదా ఓటమికి 0 పాయింట్లు వచ్చాయి.
పట్టికలలోని స్థానాలు మొదట పాయింట్ల ద్వారా, తరువాత విజయాల ద్వారా, ఆపై హెడ్-టు-హెడ్ రికార్డ్, చివరకు నెట్ రన్ రేట్ ద్వారా నిర్ణయించబడ్డాయి.[20]
జట్టు | మొదటి | చివరి | టైటిల్స్ | రన్నర్స్-అప్ |
---|---|---|---|---|
ఆంధ్ర | 2008–09 | 2022–23 | 0
|
0
|
అరుణాచల్ ప్రదేశ్ | 2018–19 | 2022–23 | 0
|
0
|
అసోం | 2008–09 | 2022–23 | 0
|
0
|
బరోడా | 2008–09 | 2022–23 | 0
|
0
|
బెంగాల్ | 2008–09 | 2022–23 | 0
|
3
|
బీహార్ | 2018–19 | 2022–23 | 0
|
0
|
చండీగఢ్ | 2019–20 | 2022–23 | 0
|
0
|
ఛత్తీస్‌గఢ్ | 2016–17 | 2022–23 | 0
|
0
|
ఢిల్లీ | 2008–09 | 2022–23 | 1
|
1
|
గోవా | 2008–09 | 2022–23 | 0
|
0
|
గుజరాత్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
గుజరాత్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
గుజరాత్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
గుజరాత్ | 2008–09 | 2022–23 | 0
|
3
|
గుజరాత్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
గుజరాత్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
గుజరాత్ | 2008–09 | 2022–23 | 0
|
1
|
కేరళ | 2008–09 | 2022–23 | 0
|
0
|
మధ్యప్రదేశ్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
మహారాష్ట్ర | 2008–09 | 2022–23 | 0
|
5
|
మణిపూర్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
మేఘాలయ | 2018–19 | 2022–23 | 0
|
0
|
మిజోరం | 2018–19 | 2022–23 | 0
|
0
|
ముంబై | 2008–09 | 2022–23 | 0
|
0
|
నాగాలాండ్ | 2018–19 | 2022–23 | 0
|
0
|
ఒడిశా | 2008–09 | 2022–23 | 0
|
0
|
పాండిచ్చేరి | 2018–19 | 2022–23 | 0
|
0
|
పంజాబ్ | 2008–09 | 2022–23 | 1
|
0
|
రైల్వేస్ | 2008–09 | 2022–23 | 11
|
0
|
రాజస్థాన్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
సౌరాష్ట్ర | 2008–09 | 2022–23 | 0
|
0
|
సిక్కిం | 2008–09 | 2022–23 | 0
|
0
|
తమిళనాడు | 2008–09 | 2022–23 | 0
|
0
|
త్రిపుర | 2008–09 | 2022–23 | 0
|
0
|
ఉత్తరఖండ్ | 2018–19 | 2022–23 | 0
|
0
|
ఉత్తర ప్రదేశ్ | 2008–09 | 2022–23 | 0
|
0
|
విదర్భ | 2008–09 | 2022–23 | 0
|
0
|
బుతువు | విన్నర్ | రన్నర్అప్ | అత్యధిక పరుగుల స్కోరర్ | లీడిగ్ వికెట్ టేకర్ | Refs |
---|---|---|---|---|---|
2008–09 | పూర్తి ఫలితాలు నమోదు కాలేదు | [21] | |||
2009–10 | రైల్వేస్ | మహారాష్ట్ర | తిరుష్ కామిని (తమిళనాడు) 339 | సోనియా డబీర్ (మహారాష్ట్ర) 16 | [22][23][24] |
2010–11 | రైల్వేస్ | బెంగాల్ | మమతా కనోజియా (హైదరాబాద్) 283 | అన్నేషా మైత్రా (బెంగాల్); పూనమ్ జగ్తాప్ (మహారాష్ట్ర); సీమా పూజరే (ముంబై) 14 | [25][26][27] |
2011–12 | రైల్వేస్ | ఢిల్లీ | జయ శర్మ (ఢిల్లీ) 318 | రసనార పర్వీన్ (ఒడిశా) 15 | [28][29][30] |
2012–13 | రైల్వేస్ | హైదరాబాద్ | స్మృతి మందాన (మహారాష్ట్ర) 311 | స్నేహ రాణా (పంజాబ్) 17 | [31][32][33] |
2013–14 | రైల్వేస్ | హైదరాబాద్ | లతికా కుమారి (ఢిల్లీ) 204 | ఏక్తా బిష్త్ (రైల్వేస్) 13 | [34][35][36] |
2014–15 | రైల్వేస్ | మహారాష్ట్ర | హర్మన్‌ప్రీత్ కౌర్ (రైల్వేస్) 262 | దేవికా వైద్య (మహారాష్ట్ర) 14 | [37][38][39] |
2015–16 | రైల్వేస్ | మహారాష్ట్ర | స్మృతి మందాన (మహారాష్ట్ర) 224 | రూపాలి చవాన్ (గోవా) 13 | [40][41][42] |
2016–17 | రైల్వేస్ | హైదరాబాద్ | మిథాలి రాజ్ (రైల్వేస్) 311 | నిధి బులే (మధ్య ప్రదేశ్) 18 | [43][44][45] |
2017–18 | ఢిల్లీ | మహారాష్ట్ర | నేహా తన్వర్ (ఢిల్లీ) 189 | కీర్తి జేమ్స్ (కేరళ) 17 | [46] |
2018–19 | పంజాబ్ | కర్ణాటక | ప్రియా పునియా (ఢిల్లీ) 382 | ప్రియాంక ప్రియదర్శిని (ఒడిశా) 17 | [47] |
2019–20 | రైల్వేస్ | బెంగాల్ | రుమేలీ ధార్ (బెంగాల్) 296 | నుపుర్ కోహలే (విదర్భ) 18 | [48][49][50] |
2021–22 | రైల్వేస్ | మహారాష్ట్ర | కిరణ్ నవ్‌గిరే (నాగాలాండ్) 525 | ఆర్తి కేదార్ (మహారాష్ట్ర) 13 | [18][51] |
2022–23 | రైల్వేస్ | బెంగాల్ | దిశా కసత్ (విదర్భ) 300 | అంజలి శర్వాణి (రైల్వేస్) 17 | [19][52] |
2023–24 | ముంబై | ఉత్తరాఖండ్ | జెమిమా రోడ్రిగ్స్ (ముంబై) 473 | సైకా ఇషాక్ (బెంగాల్) 18 | [53] |